బిగ్‌ బాస్‌ వీకెండ్‌లో నాగార్జున ధరించే షర్ట్స్ కాస్ట్ ఎంతో తెలుసా? రెండు మూడు ఫ్యామిలీలు ఈజీగా బతకొచ్చు

First Published | Sep 24, 2024, 3:47 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన వీకెండ్స్ లో వేసే షర్ట్ కాస్ట్, గాడ్జెట్స్ కాస్ట్ లీక్‌ అయ్యాయి. తెలిస్తే ఫ్యూజులు ఔట్‌. 
 

Bigg Boss Telugu 8

కింగ్‌ నాగార్జున గత ఆరు సీజన్లుగా బిగ్‌ బాస్‌ షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ ఫస్ట్ సీజన్‌కి హోస్ట్ చేయగా, రెండో సీజన్‌కి నాని హోస్ట్ గా చేశాడు. మూడో సీజన్‌ నుంచి నాగార్జున కొనసాగుతున్నారు. ఆయన హోస్టింగ్‌పై మధ్య మధ్యలో కొన్ని విమర్శలు వచ్చినా తనే బెస్ట్ అని నిరూపించుకుంటున్నాడు. హుందాగా హోస్టింగ్‌ చేస్తున్నారనే ప్రశంసలు దక్కుతున్నాయి. అదే సమయంలో డిస్ని ప్లస్ హాట్‌ స్టార్‌తోనూ ఉన్న అగ్రిమెంట్‌ ప్రకారం ఆయన హోస్ట్ గా రన్‌ అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ రన్‌ అవుతుంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

నాగార్జున బిగ్‌ బాస్‌ తెలుగు 8 షోకి వీకెండ్స్ లో వస్తారు. ఆయన శనివారం, ఆదివారం వచ్చి హౌజ్‌మేట్స్ తో మాట్లాడతారు. వారి తప్పొప్పులు చెబుతాడు. వార్నింగ్‌ ఇస్తాడు. అదే సమయంలో ప్రశంసలు కూడా కురిపిస్తారు. వారితో గేమ్ ఆడిస్తాడు. ఆడిస్తాడు, పాడిస్తాడు, వీకెండ్‌ అంటే ఫన్‌ కి కొదవలేదు. అదే సమయంలో శనివారం ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్ ఎవరు తప్పు చేశారో చెబుతూ క్లాస్‌ పీకడాలు కూడా ఉంటాయి. దీంతో ఈ ఎపిసోడ్‌ మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నాగ్‌ వారి విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడనేది చూసే ఆడియెన్స్ లో మోస్ట్ క్యూరియాసిటీ నెలకొంటుంది. 
 


నాగార్జున ప్రతి వీకెండ్‌లో రెండు రోజు డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్ ధరిస్తారు. ఆయన షర్ట్స్ ధరించే వాచ్‌, గ్లాసెస్‌ చాలా స్పెషల్‌గా నిలుస్తుంటాయి. అందరిని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆయన హోస్టింగ్‌తోపాటు ఆయన ధరించి దుస్తులు, గాడ్జెట్స్ ని కూడా క్యూరియస్‌గా చూస్తుంటారు ఆడియెన్స్. అవి ప్రత్యేకంగా ఉండటంతో అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగ్‌ గత వారం బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో మూడో వారం వీకెండ్స్ లో ధరించి షర్ట్స్, గాడ్జెట్స్ కి సంబంధించిన కాస్ట్ ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయా వివరాలు లీక్‌ అయ్యాయి. వాటి కాస్ట్‌ చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. 
 

ఈ వీకెండ్‌లో నాగ్‌ రెండు డిఫరెంట్‌ షార్ట్స్ ధరించారు. అంతేకాదు స్టయిలీష్‌ గ్లాసెస్‌ కూడా ధరించారు. వాటి ధరలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అవి తెలిస్తే వామ్మో అని ముక్కున వేలేసుకోవాల్సింది. జనరల్‌గా సాధారణ ప్రజలు, ఎంప్లాయిస్‌గానీ వెయ్యి, రెండు వేల రేంజ్‌ షర్ట్ వాడుతుంటారు. ఇంకా రిచ్ అయితే మూడు వేల వరకు వెళ్తారు. ఈవెంట్లు, ఫంక్షన్ల సందర్భంలో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులు ధరిస్తారు. వాటి ధర మహా అయితే నాలుగైదు వేలు ఉంటుంది. కానీ బిగ్‌ బాస్‌ షో కోసం నాగ్‌ ధరించి షర్ట్ ధరలు తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఒక్కో షర్ట్ ధర 15 వేల వరకు ఉండటం విశేషం. 
 

ఈ శనివారం నాగార్జున డార్క్ బ్లూ, పైన డార్క్ గ్రీన్‌(ఆర్మీ కలర్‌)ని తలపించే షాంతను నిఖిల్‌ మోడల్‌ షర్ట్ ధరించారు. ఇది జస్ట్ కాజ్వల్ గా చెప్పొచ్చు. దీని ధర ఏకంగా 14,500 కాస్ట్ ఉండటం విశేషం. ఇక ఆదివారం మరింత సింపుల్‌ షర్ట్ లో కనిపించారు నాగ్‌. స్కాచ్‌ సోడా మోడల్‌కి చెందిన షార్ట్ ధరించగా, దీని కాస్ట్ సైతం 15వేలు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ధరలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

అలాగే గత వారం నాగార్జున స్పెషల్‌ గ్లాసెస్‌ ధరించారు. బాల్మైన్‌ మోడల్‌ గ్లాసెస్‌ ధరించి చాలా యంగ్‌గా, స్టయిల్‌గా కనిపించారు. సూపర్‌ కూల్‌ లుక్‌లో అదరగొట్టారు. ఈ గ్లాసెస్‌ ధర తెలిస్తే నిజంగానే మతిపోవాల్సిందే. వీటి ధర ఏకంగా 82 వేలు ఉండటం విశేషం. ఈ లెక్కన నాగ్‌ ఒక్క రోజు కాస్ట్ లక్ష రూపాయలు అవుతుందని చెప్పొచ్చు.

Bigg boss telugu 8

ఈ కాస్ట్ తో ఈజీగా రెండు మూడు ఫ్యామిలీ నెల మొత్తం బతికేయోచ్చు. ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 8 షో 14 మంది కంటెస్టెంట్లతో ఈ నెల (సెప్టెంబర్ 1న) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్‌ అయ్యారు. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్‌ బాషా, మూడో వారం అభయ్‌ నవీన్ ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం నాల్గో వారం నడుస్తుంది. నాల్గో వారం నామినేషన్స్ లో ఆదిత్య ఓం, ప్రేరణ, మణికంఠ, నబీల్‌, పృథ్వీరాజ్‌, సోనియా నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చూడాలి. 
 

Latest Videos

click me!