SV Krishna Reddy: అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు ఒక్కటి కూడా చూడడం లేదు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ దారుణం

Published : Sep 24, 2026, 02:21 PM IST

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తన సినిమాల్లో నటించిన కొందరు హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ క్రేజీ హీరోయిన్ ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

PREV
15
SV Krishna Reddy

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. వినోదాత్మక చిత్రాలకు ఆయన ఒక బ్రాండ్. సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో ఎస్వీ కృష్ణారెడ్డి ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. వినోదాత్మక సినిమాలతో పాటు హెవీ సెంటిమెంట్ ఉన్న సినిమాలు చేయడంలో కూడా ఎస్వీ కృష్ణారెడ్డి ఆయనకు ఆయనే సాటి.

25
సౌందర్య ఒప్పుకోలేదు

ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో లెజెండ్రీ హీరోయిన్ సౌందర్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా సినిమాల్లో హీరోయిన్లని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడిని అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. సౌందర్య మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి సినిమాల్లో నటించింది. అలీ పక్కన యమలీలలో నటించమని అడిగితే ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆమె బాధపడి నాకు ఫోన్ చేసి సారీ చెప్పింది.

35
నా కోసం బాబు మోహన్ పక్కన చేసింది

ఆ తర్వాత నా కోసం బాబు మోహన్ పక్కన సాంగ్ చేసింది. అలాంటి హీరోయిన్లు ఎంత మంది ఉంటారు ? ఇండస్ట్రీలో హీరోయిన్ల వేధింపులు అంటూ వస్తున్న వార్తలు నాకు తెలియదు నేను పట్టించుకోను. ఎందుకంటే హీరోయిన్లని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. రమ్యకృష్ణ ఆహ్వానం మూవీలో నటించింది. షూటింగ్ చివరి రోజు ఆమెకి వెండి పళ్లెంలో చీర పసుపు కుంకుమ తో పాటురూ 10000 డబ్బు పెట్టి పంపాము. ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేసింది.

45
జీర్ణించుకోలేకపోయా

సౌందర్య మహానటి అంతటి నటి. అలీ పక్కన నటించను అని చెప్పింది. ఆ తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ఆ పని చేసింది. సౌందర్య చనిపోయినప్పుడు అస్సలు జీరించుకోలేకపోయాను.

55
అన్నా చెల్లెల్లు ఇద్దరూ మంటల్లో ఆహుతి

సౌందర్య, వాళ్ళ అన్నయ్య ఇద్దరూ మంటల్లో ఆహుతి అయిపోవడం చాలా దారుణం. ఆ సంఘటన తర్వాత ఇప్పటికీ సౌందర్య సినిమాలు చూడలేకపోతున్నా. అంతటి గొప్ప నటి మంటల్లో మసి అయిపోయింది అంటే చాలా బాధగా ఉంది. నిజంగా అది విధిరాత అనే చెప్పాలి అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోషనల్ అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories