KCR: ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్.. థియేటర్లలో ఈలలు, అరుపులతో రచ్చ రచ్చ..

Published : Sep 24, 2026, 01:29 PM IST

KCR: ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణ నెలకొంది. ఈక్రమంలో ఈసినిమాలో కేసీఆర్ పాత్ర ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. కేసీఆర్ ను పోలిన పాత్రలో నటుడు ప్రియదర్శిని చూసి..థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

PREV
14
ప్యారడైజ్ మూవీకి భారీ స్పందన..

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరెకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా మూవీ ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్యారడైజ్ మూవీకి భారీగా స్పందన వస్తోంది. ఈ సినిమాలో నాని మాస్ యాక్షన్, అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటన్నింటితో పాటు ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నటుడు ప్రియదర్శి పోషించిన ‘శంకరన్న’ (ఎమ్మెల్యే శంకరన్న) పాత్ర.

24
కేసీఆర్ ను పోలిన పాత్రలో ప్రియదర్శి..

సినిమాలో ప్రియదర్శి కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ, ఆయన పాత్ర థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. శంకరన్న పాత్ర రూపకల్పన, ప్రియదర్శి మేనరిజమ్స్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలి ఉండటం ఈ సినిమాకు హైలైట్‌గా మారింది. ప్రియదర్శి డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ప్రియదర్శి తీరు, తెలంగాణ యాసలోని స్పష్టత, ఆయన బాడీ లాంగ్వేజ్ , రాజకీయ నాయకుడిగా ప్రదర్శించిన హావభావాలు అచ్చం కేసీఆర్‌ను తలపిస్తున్నాయని ప్రేక్షకులు, నెటిజన్లు సంబరపడిపోతున్నారు.

34
ప్రియదర్శి డైలాగ్స్ కు ఈలలు అరుపులు..

ముఖ్యంగా సినిమాలో బాధితుల అస్తిత్వం, వారి గుర్తింపు కోసం పోరాడే శంకరన్న పాత్ర కావడం, ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు థియేటర్లలో ఈలలు, అరుపులు, కేకలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. "బక్కగా ఉన్నాడని తక్కువ అంచనా వేయకండి.. ప్రాణాలకు తెగించి అయినా మీ హక్కులను, గుర్తింపును సాధించి పెడతాను" అనే కోణంలో ప్రియదర్శి పలికిన డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్యారెక్టర్ డెలివరీ సినిమాలోని కీలక సన్నివేశాలకు ఎంతో బలాన్ని చేకూర్చింది.

44
సీనియర్ ఎన్టీఆర్ ను పోలిన పాత్ర...

దీనికితోడు సీనియర్ నటుడు పీ. విజయ్ కుమార్ కూడా ఎన్టీఆర్‌ను తలపించే తరహా పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్న ప్రియదర్శి, ఈ చిత్రంలో శంకరన్నగా చూపించిన నటన ఆయన కెరీర్‌లో మరొక గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుందని భావిస్తున్నారు. నాని అద్భుతమైన పర్‌ఫార్మెన్స్, పవర్ ఫుల్ కాన్సెప్ట్, ప్రియదర్శి మాస్ క్యారెక్టర్ కలయికతో ‘ది ప్యారడైజ్’ థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories