చిరంజీవి కి భార్య సురేఖ అంటే భయమా ? మెగా డాటర్ సుస్మిత కొణిదెల వెల్లడించిన టాప్ సీక్రెట్

Published : Sep 12, 2025, 12:35 PM IST

చిరంజీవి తన భార్య సురేఖను ఎంతగా ప్రేమిస్తారో తెలిసిన విషయమే. అయితే ఆమెను చూసిన సమయంలో ఆయనకు కొంచెం భయం కూడా ఉంటుందని ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల సరదాగా చెసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే?

PREV
14
టాలీవుడ్ రారాజు గా చిరంజీవి

చిరంజీవి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్ లో మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చిన ముందుండి పరిష్కరిస్తూ, టాలీవుడ్ కు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు మెగాస్టార్. చిరంజీవికి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే కాదు, పొలిటికల్ గా కూడా ఎంతో ఇమేజ్ ఉంది. ఆయన అంటే స్టార్ హీరోలు, మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఎంతో గౌరవిస్తుంటారు. చిన్న ఇండస్ట్రీలో చిన్న హీరోలకు చిరంజీవి ఆదర్శం. నిర్మాతలు, దర్శకులు మెగాస్టార్ అంటే చాలా గౌరవంగా జాగ్రతత్తగా ఉంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎదురులేని, తిరుగులేని ఇమేజ్ సాదించకున్న చిరంజీవి ఎవరికి భయపడతారో తెలుసా?

24
మెగాస్టార్ కు భార్య అంటే భయమా?

మెగాస్టార్ చిరంజీవిని భయపెట్టే ధైర్యం ఒకే ఒక్కరికి ఉంది. ఆవ్యాక్తి మరెవరో కాదు ఆయన భర్య సురేఖ. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత వెల్లడించారు. చిరంజీవి టాప్ సీక్రేట్ ను ఆమె రీసెంట్ గా బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖను ఎంతగా ప్రేమిస్తారో తెలిసిన విషయమే. అయితే ఆమెను చూసిన సమయంలో ఆయనకు కొంచెం భయం కూడా ఉంటుందని ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటన నిర్మాత సాహు గారపాటి నిర్మాణంలో రూపొందుతున్న రెండు సినిమాల నేపథ్యంలో చోటుచేసుకుంది. ఒకటి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకరవరప్రసాద్ గారు, మరొకటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన కిష్కిందపురి.

34
సీక్రేట్ వెల్లడించిన మెగా డాటర్ సుస్మిత

బుధవారం జరిగిన కిష్కిందపురి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సుస్మిత కొణిదెలతో యాంకర్ సుమ సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా సుమ సుస్మితను ప్రశ్నిస్తూ.. “నాన్నకి అమ్మ అంటే కొంచెమైనా భయం ఉంటుందా?” అన్నది అక్కడున్న వారు సుస్మిత ఏం చెపుతందా అని ఇంట్రెస్ట్ గా ఎదురు చూశారు. ఈ ప్రశ్నకు స్పందించిన సుస్మిత, “ఈరోజే భయపడ్డారు. మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో ఓ పాట షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ చూసేందుకు అమ్మ (సురేఖ) సెట్స్‌కు వచ్చారు. అప్పటివరకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన నాన్న, ఆమెను చూసిన క్షణానికే కంగారుపడి, ఒక్కసారిగా స్టెప్పులు మరిచిపోయారు. తడబడ్డారు కూడా,” అని అన్నారు. దాంతో అక్కడున్నవారంతా పెద్దగా నవ్వారు.

44
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు

అంతటి మెగాస్టార్ కూడా భర్యకు బయపడాల్సిందే అని అనుకున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు సెట్స్ ఏక్కి స్తున్నారు. ఆయన నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి కావడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగానే ఉంది. మరోవైపు యంగ్ డైరెక్టర్ వశిష్ట తో చిరంజీవి చేసిన విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్ నడుస్తున్నాయి. ఇందుకోసం సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈసినిమాను నెక్స్ సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories