లలిత్ మోదీతో డేటింగ్‌పై స్పందించిన సుస్మితాసేన్ మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్

Published : Jul 16, 2022, 11:44 AM IST

బాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది బాలీవుడ్ సీనియర్ స్టార్ సుస్మితా సేన్. ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీతో కొత్తగా డేటింగ్ స్టార్ట్ చేయడంతో బాలీవుడ్ అంతా ప్రస్తుతం ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ విషయంలో స్పందించారు సుస్మితా సేన్ తాజా మాజీ లవర్ రోహ్మాన్. ఇంతకీ ఈయన ఏమన్నారు. 

PREV
18
లలిత్ మోదీతో డేటింగ్‌పై  స్పందించిన సుస్మితాసేన్  మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్

ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీతో డేటింగ్ లో మునిగి తేలుతోంది  బాలీవుడ్ సీనియర్ బ్యూటీ  సుస్మితా సేన్. ఇక వీళిద్దరి మ్యాటర్ ప్రస్తుతం  సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.  అయితే వీరిద్దరి బంధాన్ని ముందుగా లలిత్ మోదీ  ట్విట్ట్ లో ప్రకటించగా దానిని సుస్మితా సేన్ కన్ ఫార్మ్ చేసింది. 
 

28

ఈ విషయాన్ని వెల్లడిస్తూ సుస్మితా సేన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్  కూడా పెట్టింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని. అందమైన  ప్రదేశంలో ఉన్నానని, అలా అని పెళ్లి చేసుకోలేదు,  ఉంగరాలు మార్చుకోలేదని, షరతులు లేని ప్రేమ తనను చుట్టుముట్టేసిందని పోస్ట్ లో రాసుకొచ్చింది సుస్మితా. 
 

38

సుస్మితా పోస్ట్ తెగ వైరల్ అయింది. సుస్మిత ఈ పోస్ట్ చేసిన వెంటనే బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఈ విషయం  తీవ్ర చర్చనీయాంశమైంది.ఇక ఈ విషయంలో చాలా మంది స్పందించారు. అందులో సుస్మితా సేన్ తాజా మాజీ ప్రియుడు రోహ్మాన్ కూడా ఉన్నారు. 

48

లలిత్ మోదీతో సుస్మిత డేటింగ్‌పై ఆమె మాజీ ప్రియుడు, మోడల్ రోహ్మాన్ షాల్ స్పందించాడు. సుస్మితా సంతోషంగా ఉండాలి అని కోరకున్నారు. వారిద్దరు ఆనందంగా ఉండాలని కోరకున్నాడు. అంతే కాదు ప్రేమ చాలా అందంగా ఉంటుంది... సుస్మితా ఎవరినైనా సెలక్ట్ చేసుకుంది అంటే అతను చాలా విలువైన వాడితో సమానం అంటూ స్పందించారు రొహ్మాన్. 

58

ఇక, సుస్మితాసేన్, రోహ్మాన్ షాల్ 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. దాదాపు మూడేళ్లకు పైగా సహజీవనం చేసిన ఈ జంట  గతేడాది డిసెంబర్ లో విడిపోయారు. తమ బ్రేకప్‌ను ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా ఈ జంట  వెల్లడించారు. స్నేహితులుగా తమ ప్రయాణం ప్రారంభమైందని, ఇకపైనా అలాగే ఉంటామని సుస్మిత తన పోస్ట్ లో పేర్కొంది. 
 

68

రిలేషన్‌షిప్ ముగిసి చాలాకాలమైందని, ప్రేమ మాత్రం ఉంటుందని తెలిపింది రోహ్మాన్ విషయంలో పోస్ట్ చేసింది సుస్మితా. ఇక సుస్మితతో బంధంపై  లలిత్ మోదీ  అధికారికంగా ప్రకటించాడు. ప్రపంచాన్ని చుట్టేసిన  తర్వాత ఇప్పుడే లండన్ చేరుకున్నామని, కుటుంబాలతో కలిసి మాల్దీవులు వెళ్లామని ట్విట్టర్ లో క్లియర్ గా రాసుకొచ్చాడు. 
 

78

ఇక  తన పార్టనర్ గా  సుస్మితా సేన్ తో ఎట్టకేలకు కొత్త జీవితం ప్రారంభమైందని అన్నారు లలిత్. అయిత ఆతరువాత తేరుకున్న లలిత్.. కేవలం  ప్రేమలో ఉన్నామని, ఇంకా పెళ్లి చేసుకోలేదని వివరించాడు. దేవుడి దయతో ఏదో ఒకరోజు అది కూడా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

88

ఇక ప్రస్తుతం వీరి బంధంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొంత మంది వీరికి శుభాకాంక్షలు తెలుపుతుంటే... మరికొంత మంది మాత్రం ధారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆర్థిక నేరాల అభియోగాలతో మోడీ ఇండియాను వదిలి ఫారెన్ లో ఉంటున్నాడు. ఆయనపే చాలా కాలంగా చాలాకేసులు నడుస్తున్నాయి. 

click me!

Recommended Stories