దుమ్మురేపుతున్న జన నాయకుడు ట్రైలర్.. 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ సాధించిందో తెలుసా?

Published : Jan 06, 2026, 02:47 PM IST

దళపతి విజయ్ చివరి సినిమా  జన నాయకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కాబోతున్న ఈసినిమా  ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. 

PREV
13
జన నాయకుడు ట్రైలర్..

సౌత్ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా జన నాయకుడు. సంక్రాంతి కానుకగా ఈసినిమా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

23
రికార్డు క్రియేట్ చేసిన జన నాయకుడు ట్రైలర్..

విజయ్ చివరి సినిమా కావడంతో జన నాయకుడు సినిమాపై భారీ అంచనాలు, ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల క్రితం మలేషియాలో ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం రిసెంట్ గా ఓ ఛానెల్‌లో ప్రసారమవ్వగా భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. మలేషియాలో జరిగిన ఈ ఆడియో లాంచ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మూవీ టీమ్ అభిమానులు పంచుకున్నారు.

33
జన నాయకుడు ట్రైలర్ కు భారీ రెస్పాన్స్...

ఇక తాజాగా జన నాయకుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కు భారీగా రెప్పాన్స్ వస్తోంది.  యూట్యూబ్‌లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదిస్తోంది.  మొదటి 24 గంటల్లోనే ఈ ట్రైలర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 31 మిలియన్లు,  యూట్యూబ్‌లో 83.7 మిలియన్ల ప్యూస్ ను సాధించి దూసుకుపోతోంది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories