చావంటే చాలా భయమన్న సుశాంత్.. చివరకు!

First Published Jun 28, 2020, 2:47 PM IST

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుశాంత్, తనకు చావు అంటే చాలా భయం అని చెప్పాడు. `మూడు గంటలు నిద్రపోతేనే మనం ఎవరో కూడా మనకు తెలియని లోకంలోకి వెళ్తాం. మనం ఎక్కడున్నాం, మన ముందు ఎవరున్నారో కూడా తెలియదు. చనిపోయినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. అందుకే నాకు చావు అంటే చాలా భయం` అన్నాడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌.

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి చెంది వారం రోజులు దాటినా కుటుంబ సభ్యులు సినీ వర్గాలతో పాటు అభిమానుల కూడా ఆయన్ను మరిచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌కు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించి కొన్ని విశేషాలు ఇప్పుడు అభిమానుల గుండె బరువెక్కేలా చేస్తున్నాయి.
undefined
గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుశాంత్, తనకు చావు అంటే చాలా భయం అని చెప్పాడు. `మూడు గంటలు నిద్రపోతేనే మనం ఎవరో కూడా మనకు తెలియని లోకంలోకి వెళ్తాం. మనం ఎక్కడున్నాం, మన ముందు ఎవరున్నారో కూడా తెలియదు. చనిపోయినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. అందుకే నాకు చావు అంటే చాలా భయం` అన్నాడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌. ఈ విషయం గుర్తు చేసుకున్న అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
undefined
సుశాంత్ చివరి చిత్రం చిచోరేలో కూడా ఆత్మహత్య గురించే సందేశం ఇచ్చాడు. జీవితంలోని కష్టాలకు ఆత్మహత్య సమాధానం కాదని చెప్పే పాత్రలో కనిపించాడు సుశాంత్. కానీ తానే జీవితంతో పోరాడలేక ఆత్మహత్య చేసుకోవటంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
undefined
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఈ నెల 14న తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఇండస్ట్రీలోని చీకటి కోణాలు చర్చకు వచ్చాయి. సినీరంగంలో వారసత్వం కారణంగానే ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ టాలెంట్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న చర్చ జరుగుతోంది.
undefined
click me!