జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుశాంత్ మరణానికి ఇండస్ట్రీలోని మాఫియా, నెపోటిజం (వారసత్వం) ప్రధాన కారణం అన్న ప్రచారం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సంచలన ఆరోపణలు చేశారు.
undefined
సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురి మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ టైమ్స్ నౌతో మాట్లాడుతూ సంచనల ఆరోపణలు చేశారు.
undefined
`సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, వారు సుశాంత్ తండ్రి మీద ఒత్తిడి చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థల మీద ఆరోపణలు చేయాలని వారు సుశాంత్ కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి చేస్తున్నారు. నిజానికి ఈ కేసులో నిర్మాణ సంస్థల ప్రమేయం ఏ మాత్రం లేద`ని తెలిపారు వికాస్ సింగ్.
undefined
రియాను ఏం అనవద్దని, నిర్మాణ సంస్థల మీదే ఆరోపణలు చేయాలని ముంబై పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పటి వరకు ముంబై పోలీసులు లాజికల్ ఎండ్ కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. పోలీసులు కేసులు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.
undefined
సుశాంత్ దగ్గరకు రియా వచ్చిన తరువాతే ఆయన కుటుంబ సభ్యులకు దూరమయ్యాడని, సుశాంత్ మరణానికి సంబంధించిన నేరం అప్పుడే మొదలైందని వికాస్ సింగ్ తెలిపారు. రియా సుశాంత్‌ను తండ్రికూడా మాట్లాడనివ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయం గతంలోనే గ్రహించిన సుశాంత్ కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 25న బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ కూడా ఇచ్చినట్టుగా తెలిపారు.
undefined
సుశాంత్ ఇంట్లో పనివారిని, బాడీ గార్డ్‌లను కూడా రియా మార్చేసిందని, తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను తెచ్చిపెట్టి సుశాంత్ జీవితాన్ని పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకుందని వికాస్ సింగ్ తెలిపారు. రియా, సుశాంత్ డబ్బును, క్రెడిట్ కార్డ్‌లను ఎలా వాడుకుందన్న వివరాలను కూడా పోలీసులకు అందించినట్టుగా వివరించారు.
undefined
సుశాంత్‌కు సేంద్రియా వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఉండేదని, అందుకే కూర్గ్ వెళ్లాలనుకున్నా రియానే ఆపిందని, కానీ సుశాంత్ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం ఆమె వదిలేసి వెళ్లిపోయిందని వికాస్ సింగ్ తెలిపారు. అంతేకాదు త్వరలోనే రియాను అదుపులోకి తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు వికాస్ సింగ్.
undefined