`రాధే శ్యామ్‌`కు దిమ్మ తిరిగే పేమెంట్ అందుకుంటున్న ప్రభాస్

First Published | Jul 29, 2020, 4:26 PM IST

ప్రస్తుతం ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో భారీ మార్కెట్‌ ఉండటం, నాలుగైదు భాషల్లో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉండటంతో రాధే శ్యామ్‌ను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు పారితోషికం కూడా భారీగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది.

బాహుబలి సినిమాతో ప్రభాస్‌ రేంజే మారిపోయింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో సూపర్‌ హిట్ కావటంతో ప్రభాస్ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. బాహుబలి తరువాత చేసిన సాహో కూడా బాలీవుడ్‌లో భారీ వసూళ్లు సాధించటంతో ప్రభాస్ ప్రతీ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నారు మేకర్స్‌. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న రాధే శ్యామ్‌ ను కూడా అదే రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.
undefined
సాహో సినిమా సెట్స్‌ మీద ఉండగానే ఈ మూవీ మొదలైంది. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరకుంది. లాక్‌ డౌన్‌ రాకపోయుంటే ఈ పాటికి షూటింగ్ అంతా పూర్తయ్యేంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా మారింది.
undefined
Tap to resize

ప్రస్తుతం ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో భారీ మార్కెట్‌ ఉండటం, నాలుగైదు భాషల్లో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉండటంతో రాధే శ్యామ్‌ను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు పారితోషికం కూడా భారీగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా రాధే శ్యామ్‌ సినిమాకు గానూ ప్రభాస్ దాదాపు 55 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
undefined
అంతేకాదు ఇటీవల ప్రకటించిన వైజయంతి మూవీస్‌ సినిమా కూడా ఇదే స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట ప్రభాస్‌. రాధే శ్యామ్ సెట్స్ మీద ఉండగానే తదుపరి చిత్రాన్ని ప్రకటించేశాడు ప్రభాస్‌. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై మహానటి ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
undefined

Latest Videos

click me!