అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్". టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాకి టాలీవుడ్ లో వరుసగా భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీతా గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్స్ తో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ కు, అలానే హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ద్ శ్రీరామ్ పాడిన మనసా పాటకు, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ కు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీం తాజగా ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ కపుల్ పోస్టర్ ని విడుదల చేసింది.
బుధవారం విడుదల చేసిన పోస్టర్ లో అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే యూత్ లో ఒక తెలియని రొమాంటిక్ ఫీల్ వస్తుంది అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని పూజా ల మద్య ఎలాంటి కెమిస్ట్రి వుండబోతుందో ఈ పోస్టర్ డిజైనింగ్ లో చాలా చక్కగా చూపించారు దర్శకుడు.
ఇప్పటికే 70 శాతం పూర్తయ్యి లవ్లీ అండ్ హోల్ సం ఫ్యామిలీ ఎంటెర్‌టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ వుంది. ఈ కరోనా క్రైసిస్ కొంచెం తగ్గితే ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ అక్కినేని మరియు పూజా లు షూటింగ్ కి సిద్దంగా వున్నా బయట పరిస్థుతుల దృష్ట్యా నిర్మాతలు బన్నీ వాసు, వాసు వర్మ లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇప్పటికే కీలకమైన సన్నివేశాలతో పాటు మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఈ లాక్ డౌన్ లో గోపి సుందర్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిచేశారు. అలాగే అతి త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆమని, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2021 లో జనవరి లో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.