విడాకులు తీసుకున్నా కళ్యాణే నా భార్య...బిగ్ బాస్ ఫేమ్ సూర్యకిరణ్ షాకింగ్ కామెంట్స్

Published : Sep 18, 2020, 11:19 AM IST

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న దర్శకుడు సూర్య కిరణ్ మొదటివారమే హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది.  దర్శకుడిగా  ఐదు  చిత్రాలు చేసిన సూర్య కిరణ్ గురించి ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాగా సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకుని, విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు.   

PREV
15
విడాకులు తీసుకున్నా కళ్యాణే నా భార్య...బిగ్ బాస్ ఫేమ్ సూర్యకిరణ్ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 4 లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సూర్య కిరణ్ మొదటివారమే ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకులకు ఈయన పేరు పెద్దగా పరిచయం లేకపోవడం, హౌస్ లో సూర్య కిరణ్ పెద్దరికం, పెత్తనం నచ్చకపోవడంతో ఆయనకు ఆడియన్స్ తక్కువ ఓట్లు మాత్రమే వేశారు. 
 
25

ప్రేక్షకులు ఎప్పుడో ఈ దర్శకుడిని మరచిపోగా బిగ్ బాస్ షో మరలా గుర్తు చేసింది. సత్యం లాంటి హిట్ మూవీ తెరకెక్కించింది సూర్య కిరణ్ అనే విషయం ఇప్పుడే ప్రేక్షకులకు తెలిసింది. అలాగే ఆయన వ్యక్తిగత విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. 
 
35

తెలుగులో పాప్యులర్ హీరోయిన్ గా కొనసాగిన కళ్యాణి, సూర్య కిరణ్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. అప్పట్లో వీరిద్దరి పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. ఎంత సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారో, అంతే సైలెంట్ గా తక్కువ కాలంలోనే విడిపోవడం జరిగింది. 
 
45

పెదబాబు మూవీ షూటింగ్  సమయంలో ఆ చిత్ర నిర్మాతను కలవడానికి సూర్య కిరణ్ సెట్స్ కి వెళ్లారట. అప్పుడు ఆ చిత్ర హీరోయిన్ అయిన కళ్యాణితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మలయాళీలు కావడంతో మానసికంగా దగ్గర కావడం, ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి.

55

కారణం ఏమిటో తెలియదు కానీ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. వీరిద్దరూ విడిపోయి దశాబ్దం దాటిపోయింది. అయినా సూర్య కిరణ్ మరలా పెళ్లి చేసుకోలేదు. ఇదే విషయాన్ని సూర్య కిరణ్ తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. విడాకులు తీసుకున్నప్పటికీ కళ్యాణినే నా భార్య, ఆమె ఇంకా నా మనసులోనే ఉందని సూర్య కిరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. 

click me!

Recommended Stories