ఇంతవరకు ఏ హీరో డేర్ చేయలేదు..అసలు ఆ విషయాలు మీకెందుకు అంటూ ఫ్యాన్స్ కి క్లాస్ పీకిన సూర్య

First Published | Sep 23, 2024, 8:28 PM IST

సౌత్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ కలిగిన స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. విలక్షణ నటనతో సౌత్ మొత్తం క్రేజ్ తెచ్చుకున్న సూర్య త్వరలో కంగువ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు.

సౌత్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ కలిగిన స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. విలక్షణ నటనతో సౌత్ మొత్తం క్రేజ్ తెచ్చుకున్న సూర్య త్వరలో కంగువ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు. సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో కంగువ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు నవంబర్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 

Actor Suriya

ఇదిలా ఉండగా సూర్య సోదరుడు కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ మెయిలగన్. సెప్టెంబర్ 28న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. దీనితో చెన్నైలో రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూర్య, జ్యోతిక దంపతులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీ రిలీజ్ వేడుకలో సూర్య చేసిన వ్యాఖ్యలు అభిమానులంతా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. 


కేవలం సూర్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అందరి హీరోల అభిమానులకు సూర్య పరోక్షంగా చురకలు అంటించారు. సౌత్ లో ఎక్కువగా మా హీరో గొప్ప అంటే లేదు మా హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఎక్కువగా ఫ్యాన్స్ వార్ జరుగుతూ ఉంటుంది. క్రేజ్, కలెక్షన్ల విషయంలో ఫ్యాన్స్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు ఉంటాయి. 

Suriya and Karthi

దీని గురించి సూర్య మాట్లాడారు. సూర్య మాట్లాడినట్లు మరే స్టార్ హీరో డేర్ చేయలేదనే చెప్పాలి. సూర్య మాట్లాడుతూ.. కొందరు ఫ్యాన్స్ కలెక్షన్స్ విషయంలో గొడవలు పెట్టుకోవడం నచ్చడం లేదు అని అన్నారు. మా హీరోకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అని.. లేదు మా హీరో సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అంటూ వాగ్వాదం చేసుకుంటుంటారు. అసలు మీకు కలెక్షన్స్ తో పనేంటి. అది ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. 

మీరు సినిమా చూడండి చాలు. మా నటన గురించి మాట్లాడుకోండి. నచ్చితే అభినందించండి. లేకుంటే విమర్శించండి. సినిమా పాత్రల గురించి మాట్లాడుకోండి. కలెక్షన్ల గురించి మాట్లాడుకోవడం, గొడవలు పెట్టుకోవడం అవన్నీ అనవసరం అని సూర్య క్లాస్ పీకారు. సూర్య అభిప్రాయాన్ని ఎంత మంది ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారో చూడాలి. కలెక్షన్స్ గురించి మాట్లాడుకుని గొడవలు పెట్టుకోవద్దు.. అది మీకు అనవసరమైన విషయం అంటూ సూటిగా చెప్పిన హీరోలు లేరు.. ఆ ధైర్యం చేసింది సూర్య మాత్రమే అని చెప్పొచ్చు. 

Latest Videos

click me!