గేమ్ ఛేంజ‌ర్‌: సందీప్ రెడ్డి వంగా క్యారెక్ట‌రేజేష‌న్‌, నిజమేనా?

First Published | Nov 12, 2024, 7:50 AM IST

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. టీజర్ లో చరణ్ కోపంతో కనిపించడంతో ఆయన పాత్ర గురించి చర్చ జరుగుతోంది. సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు, కథలో సామాజిక అంశాలు కూడా ఉన్నాయి.

Game Changer


 రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గేమ్ మొదలైపోయింది.  టీజర్ రిలీజ్ అయ్యినప్పటి నుంచి ట్రెండింగ్ లో ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. లక్నోలో భారీ ఈవెంట్ పెట్టి, మూవీ యూనిట్ అంతా హాజరయి గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. ఇక మూడేళ్ళుగా ఈ సినిమా కంటెంట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే టీజర్ ఇచ్చారు.

 గేమ్ ఛేంజర్ టీజర్ ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది.  మూడు భాషల్లో టీజర్ రిలీజవ్వగా అన్ని భాషల్లో కలిపి గేమ్ ఛేంజర్ టీజర్ 24 గంటల్లో ఏకంగా 70 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సెట్ చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రపై రక రకాల వార్తలు మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి. అలాంటివాటిల్లో వైరల్ అవుతున్నది రామ్ చరణ్ క్యారక్టరైజేషన్. 


రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే మూవీ యూనిట్ యాక్టివ్ అయి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అవ్వగా అవి వైరల్ అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కాబోతుంది. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి టీజర్   వైరల్ అయ్యింది.

 ఈ టీజర్ చూసిన ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారక్టరైజేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. .ఈ సినిమాలో ఓ షాట్ లో  రామ్ చరణ్ చదువుతున్న ’30 రోజుల్లో కోపం త‌గ్గించుకోవ‌డం ఎలా’ అనే పుస్త‌కంపై అంద‌రి దృష్టీ ప‌డింది.  అది చూసి రామ్ చరణ్ క్యారక్టర్ ని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో హీరోకి విపరీతమైన కోపం ఎక్కువ అనే విష‌యం హైలెట్ అయ్యింది.
 

Latest Videos



హీరోకు కోపం అనగానే రీసెంట్ గా వచ్చిన సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్, అర్జున్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.  అదే తరహాలో ‘గేమ్ ఛేంజ‌ర్‌’లో రామ్ చ‌ర‌ణ్ క్యారెక్టర్ ఉండబోతోందని అంటున్నారు. ఈ సినిమా నెక్ట్స్ లెవిల్ ఉండటానికి `కోపం` అనే ఎలిమెంట్ యాడ్ చేశాడు శంక‌ర్‌. అయితే సందీప్ వంగా ట్రీట్ చేసే విధానానికి, శంకర్ ట్రీట్ చేసే విధానికి తేడా ఉంటుంది. సోషల్ ఎలిమెంట్స్  కథలో ఉంటాయి. 

 ఈ చిత్రం రామ్ చరణ్ పాత్ర కు ప్లాష్ బ్యాక్ ఉంటుందని, తండ్రికి జరిగిన అన్యాయానికి రివోల్ట్ అవటం అనేది కూడా చూపెడతారట. అలాగే చరణ్ పాత్ర చాలా ఎగ్రిసివ్ గా ఉండబోతోందిట. కాలీజి గొడవలు కూడా చూపబోతున్నారు. ఆ తర్వాత ఐపీఎస్ గా  అవటం, చివ‌రికి.. ముఖ్యమంత్రి సీట్ లో  కూర్చోవడం వంటివి జరుగుతాయట. ఇవన్నీ సినిమాలో వచ్చే హైలెట్ అంశాలుగా చెప్తున్నారు. 

పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  అలాగే ఈ సినిమాలో ఫైట్స్ డిఫరెంట్ గా ఉండనున్నాయి. దర్శకుడు శంకర్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ కు ఇది లైఫ్ అండ్ డెత్ క్వచ్చిన్ లాంటింది. దాంతో ఈ చిత్రం ఖచ్చితంగా భారీ సక్సెస్ అవుతుందని భావించి, బిజినెస్ డీల్స్ భారీగా జరుగుతున్నాయి.  
 

Game Changer Teaser

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గేమ్ ఛేంజర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ కలిపి ₹150 కోట్ల వరకూ అంచనా. ఆంధ్రా నుంచి  ₹70, సీడెడ్ నుంచి  ₹25 కోట్లు, నైజాం ఉజ్జాయింపుగా  ₹55 కోట్లు అని తెలుస్తోంది.

ఈ సినిమా చుట్టూ క్రేజ్ మెల్లిగా పుంజుకుంటోంది. దీపావళికి వచ్చే టీజర్ తో సినిమాకు క్రేజ్ రెట్టింపు అవుతోందని భావిస్తున్నారు. టీజర్ బాగా రిసీవ్ చేసుకుంటే ఎక్సపెక్టేషన్స్ పెరిగి, బిజినెస్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే ప్రమోషన్స్ బాగా చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

  'గేమ్ ఛేంజర్' OTT రైట్స్ భారీ రేటుకే అమ్ముడయ్యాయి. అమేజాన్ ప్రైమ్ వీడియో వారు రైట్స్ తీసుకున్నారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ రైట్స్ అన్ని  వారికే ఇచ్చారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మార్కెట్ ని బట్టి ఆ రేటు తక్కువకే రైట్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. దిల్ రాజు ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని మూడేళ్ల క్రితం ఇచ్చేసారు.

అప్పటికి ఇంకా RRR రిలీజ్ రాలేదు. చరణ్ కు గ్లోబల్ మార్కెట్ క్రియేట్ కాలేదు. ఈ మూడేళ్లలో చాలా మారిపోయాయి. సినిమా రిలీజ్ లేటు కావటంతో అప్పటి రేటు ఇప్పుడు చరణ్ మార్కెట్ కన్నా తక్కువగా కనపడుతోంది. ఇక గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్  ఓటిటి రైట్స్ ని Zee5 వాళ్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. 
  

click me!