కంగువా ను సూర్యనే చూడొద్దని చెప్పినట్లు అయ్యిందే, ఇంట్రెస్టింగ్ స్టోరీ!

First Published | Nov 17, 2024, 3:48 PM IST

సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ కంగువా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సూర్య గతంలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

కంగువా బాక్స్ ఆఫీస్ కలెక్షన్

తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలలో సూర్య ఒకరు. కథకు తగ్గట్టుగా శరీరాన్ని మార్చుకుని నటించే నటులు చాలా తక్కువ. అందులో సూర్య కూడా ఉన్నారు. అంతగా సినిమా కోసం కష్టపడతారు. నేరుక్కు నేర్  సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య అంచలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.

తన 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా 36 వయదినిలే, పసంగ 2, మహిళార్ మట్టుం, కడైకుట్టి సింగం, సూరరై పోట్రు, జై భీమ్, విరుమన్ వంటి సినిమాలను నిర్మించి కొన్ని హిట్లను కూడా అందుకున్నారు. చివరిగా ఆయన నిర్మాణంలో మెయ్యలగన్ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తీ హీరోగా నటించాడు. అరవింద స్వామి మరో కీలక రోల్ చేశాడు. ఈ మూవీకి మిశ్రమ స్పందన దక్కింది. 
 

సూర్య కంగువా సినిమా

ఈ సినిమా తర్వాత ఇప్పుడు తన సూర్య44 సినిమాను కూడా నిర్మిస్తున్నారు. కాగా నవంబర్ 14న కంగువా సినిమా విడుదలైంది. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ప్రతికూల స్పందన వస్తోంది. దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

కంగువా సినిమాలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటాని, యోగి బాబు, నటరాజన్, కోవై సరళ, మన్సూర్ అలీ ఖాన్ వంటి అనేక మంది నటించారు. కంగువా సినిమాను నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ ప్రతిరోజూ కంగువా వసూళ్ల గురించి అప్డేట్ ఇస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 89.32 కోట్ల వసూళ్లు సాధించిందని, మూవీ క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రకటించింది.
 


కంగువా బాక్స్ ఆఫీస్ కలెక్షన్

సూర్య భార్య జ్యోతిక కూడా కంగువా గురించి అప్డేట్ ఇచ్చారు. సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, ప్రతికూలంగా విమర్శిస్తున్న వారికి అవి తెలియవని, ఉద్దేశపూర్వకంగానే అపనిందలు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. సినిమాలో 30 నిమిషాల నిడివి మాత్రమే బాగాలేదని, సినిమాలో శబ్దం చాలా ఎక్కువగా ఉందని, ఇతర పెద్ద సినిమాలకు రాని విమర్శలు ఈ సినిమాకు మాత్రమే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.

సూర్య కంగువా సినిమా

కంగువా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సూర్య గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచి సినిమాలనే ఆడించండి. నా సినిమా అయినా సరే, చెడ్డ సినిమాని ఆడించకండి. అప్పుడే మంచి కథల కోసం నేను కష్టపడగలను అని సూర్య 2013లో చెప్పారు. ప్రస్తుతం కంగువాకు ప్రతికూల స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన సినిమాను తానే చూడొద్దని సూర్య చెప్పినట్లు అయ్యింది. 

Latest Videos

click me!