టేస్టీ తేజ, అవినాష్ లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? కీలకంగా నబీల్ డెసిషన్!

First Published | Nov 17, 2024, 2:24 PM IST


అవినాష్, టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. నబీల్ వద్ద ఉన్న అవిక్షన్ షీల్డ్ కీలకంగా మారింది. 
 

Bigg boss telugu 8

11వ వారానికి గాను నామినేషన్స్ లో ఉన్న గౌతమ్, యష్మి, పృథ్వి, విష్ణుప్రియ సేవ్ అయ్యారు. టేస్టీ తేజ, అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని నాగార్జున తెలిపారు. అయితే నబీల్ వద్ద అవిక్షన్ షీల్డ్ ఉంది. అది వాడి ఒకరిని సేవ్ చేయవచ్చని నాగార్జున చెప్పారు.

Bigg boss telugu 8

వరుసగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలిమినేట్ అవుతున్నారు. 7వ వారం నాగమణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అతడు సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో గౌతమ్ సేవ్ అయ్యాడు. అక్కడ నుండి వరుసగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంటిని వీడుతున్నారు. 8వ వారం నయని పావని ఎలిమినేట్ కాగా 9వ వారం మెహబూబ్ బయటకు వచ్చేశాడు. 

ఇక 10వ వారం ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పారు. గంగవ్వ వ్యక్తిగత కారణాలతో మిడ్ వీక్ లో వెళ్ళిపోయింది. నామినేషన్స్ లో ఉన్న హరితేజకు తక్కువ ఓట్లు పడటంతో ఆమె బిగ్ బాస్ ఇంటిని వీడారు. సీజన్ 1లో హరితేజ ఫైనలిస్ట్ కావడం విశేషం. ఆమె టాప్ 3లో నిలిచారు. ఈ సీజన్లో ఆమె ఆశించిన స్థాయిలో రాణించలేదు. 


Bigg boss telugu 8

8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా అవినాష్, టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్ మాత్రమే హౌస్లో ఉన్నారు. 11వ వారం యష్మి, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, అవినాష్, విష్ణుప్రియ, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు. మిగతా నలుగురు ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నారు. టేస్టీ తేజ, అవినాష్ డేంజర్ జోన్లోకి వచ్చారు. ఈ వారం కన్నడ బ్యాచ్ కి చెందిన యష్మి, పృథ్విరాజ్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారనే ప్రచారం జరిగింది. కానీ ఈ వారం కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీదే వేటు పడనుంది. 

Bigg boss telugu 8

టేస్టీ తేజ, అవినాష్ లలో ఒకరు ఇంటిని వీడనున్నారని నాగార్జున చెప్పారు. అయితే నబీల్ వద్ద అవిక్షన్ షీల్డ్ ఉంది. అది ఉపయోగించి ఒకరిని సేవ్ చేయవచ్చు. అవిక్షన్ షీల్డ్ ఉపయోగిస్తావా లేదా అని నబీల్ ని నాగార్జున అడిగారు. నబీల్ వాడతాను అన్నాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు. 

Bigg boss telugu 8

ఎలిమినేట్ అయ్యేవారికి కాకుండా మరొకరికి అవిక్షన్ షీల్డ్ వాడితే అది ఉపయోగించుకోనట్లే లెక్క. ఉదాహరణకు అవిక్షన్ షీల్డ్ ఉపయోగించి అవినాష్ ని నబీల్ సేవ్ చేశాడు అనుకుందాం. ఒకవేళ టేస్టీ తేజకు అవినాష్ కంటే తక్కువ ఓట్లు వస్తే అతడు ఎలిమినేట్ అవుతాడు. ఎక్కువ ఓట్లు వస్తే ఎవరూ ఎలిమినేట్ అవరు. అవినాష్ కి తేజ కంటే ఎక్కువ ఓట్లు పడిన పక్షంలో అవిక్షన్ షీల్డ్ వాడితే అది నిరుపయోగం అయినట్లు అవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో.   

మరోవైపు కంటెస్టెంట్స్ ని సపోర్ట్ చేసేందుకు కుటుంబ సభ్యులు, మిత్రులు వేదికపైకి వస్తున్నారు. నిన్న శివాజీ, సోహెల్ తో పాటు పలువురు వచ్చారు. ఇవాళ శ్రీసత్య, అమర్ దీప్ తో పాటు మరికొందరు రానున్నారు. 

Latest Videos

click me!