ఈ నేపథ్యంలో షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తుంది టీమ్. ఈ మేరకు ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లని మరోసారి హౌజ్‌లోకి తీసుకురాబోతుంది. అయితే అది వైల్డ్ కార్డ్ ద్వారా కాదు. కేవలం నామినేషన్‌కే పరిమితం చేస్తుంది. నామినేషన్ ప్రక్రియని ఈ సారి కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నారు. నామినేషన్‌ని మాజీ కంటెస్టెంట్ల చేత చేయించబోతున్నారు. వారే నామినేట్ చేయబోతున్నారట. అందుకోసం ఇప్పటికే ఎలిమినేట్ అయిన సోనియా, మెహబూబ్, నయని పావని, హరితేజ, శేఖర్ బాషా, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నైనిక వంటి వారంతా మళ్లీ రాబోతున్నారట.