బాక్సాఫీస్ కింగ్ సూర్య: తమిళ సినిమాలో టాప్ స్టార్లుగా ఉన్న రజనీకాంత్, విజయ్ కూడా చేయని ఫీట్‌ను సూర్య సాధించారు. బాక్సాఫీస్ దగ్గర కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు.
తమిళ, మలయాళ సినిమా అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న సినిమా 'సీన్'. ఆవేశం, రోమాంచం లాంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన జితు మాధవన్ ఈ తమిళ్ సినిమాను డైరెక్ట్ చేయడం వల్ల అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో సూర్య హీరోగా, నస్లెన్ విలన్‌గా, నజ్రియా హీరోయిన్‌గా నటించారు. కామెడీ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా నవంబర్ 6న థియేటర్లలో రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న 'సీన్' సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ కలెక్షన్ రిపోర్ట్‌ను మూవీ టీమ్ తాజాగా రిలీజ్ చేసింది.
25
సీన్ కలెక్షన్స్ ఎంత?
'సీన్' సినిమా ఇప్పటివరకు 205 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలీజైన ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవి. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన జకరం ప్రొడక్షన్స్ సంస్థ ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రిలీజై రెండో వారంలోకి అడుగుపెడుతున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సూర్య, నజ్రియా, నస్లెన్ యాక్టింగ్ సినిమాకు పెద్ద ప్లస్ అని అభిమానులు చెబుతున్నారు. దీంతో ఒకే ఏడాదిలో మూడు 200 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు ఇచ్చిన తమిళ్ హీరోగా సూర్య రికార్డ్ క్రియేట్ చేశారు.
35
వరుసగా మూడు 200 కోట్ల సినిమాలు
దీనికంటే ముందు ఈ ఏడాది సూర్య యాక్ట్ చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'కరుప్పు' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాను తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 212 కోట్లు వసూలు చేసినట్టు డేటా చెబుతోంది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమితా బైజు నటించింది. రాధికా శరత్‌కుమార్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు. జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇచ్చారు.
ఇదే ఏడాది సూర్య ఇచ్చిన మరో మాస్ హిట్ సినిమా అంటే 'కరుప్పు'. ఈ సినిమాను ఆర్జే బాలాజీ ప్రొడ్యూస్ చేశారు. ఇందులో సూర్య సరసన త్రిష యాక్ట్ చేసింది. ఇంద్రన్స్, దీప, నట్టి నటరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ కరుప్పు సినిమా ఈ ఏడాది మే నెలలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 340 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. సూర్య కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాతో సూర్య అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాకు సాయి అభయంకర్ మ్యూజిక్ డైరెక్టర్.
55
కోలీవుడ్ బాక్సాఫీస్ కింగ్
యాక్టర్ సూర్యకు చివరగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా అంటే సింగం 2. ఆ సినిమా రిలీజై 13 ఏళ్లు అవుతోంది. ఈ 13 ఏళ్లలో ఆయనకు థియేటర్లలో ఒక్కటంటే ఒక్క పెద్ద సక్సెస్ కూడా దక్కలేదు. దీంతో డీలా పడిపోయిన సూర్య కెరీర్‌ను 2026 సంవత్సరం పైకి లేపింది. ఒకే ఏడాదిలో 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇచ్చి తన మార్కెట్‌ను తిరిగి తెచ్చుకున్నారు సూర్య. రజనీ తర్వాత బాక్సాఫీస్ దగ్గర కింగ్‌గా దూసుకుపోతున్నారు. ఆయన సక్సెస్ వచ్చే ఏడాది కూడా కంటిన్యూ అవుతుందో లేదో వెయిట్ చేసి చూడాలి.