Allu Sneha Reddy: భార్య అల్లు స్నేహారెడ్డిని రంగంలోకి దించుతున్న అల్లు అర్జున్.. కొత్త బాధ్యతలు

Published : Nov 12, 2026, 06:27 PM IST

Allu Sneha Reddy: అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహారెడ్డి సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అందులో భాగంగా ఆమె బావోలి ఆర్ట్ సంగం లో కీలక బాధ్యతలు చేపట్టారు.

PREV
13
బావోలి ఆర్ట్ సంగం చైర్మెన్‌గా అల్లు స్నేహారెడ్డి

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. తాను నటుడిగా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తన భార్యని సామాజికి కార్యక్రమాల్లో భాగం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆమె కీలక బాధ్యతలు చేపట్టారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా మరో కీలక కార్యక్రమం ప్రారంభం కానుంది. దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో నిర్మాత అల్లు అరవింద్ కోడలు, అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆమె కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. భారతీయ కళలు, సంస్కృతి, చారిత్రక వారసత్వంపై అవగాహన పెంచే లక్ష్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఆమె భాగస్వామ్యం కావడం విశేషం.

23
ప్రజలకు మరింత చేరువగా

ఫ్యాషన్, కళలు, సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కలిగిన అల్లు స్నేహారెడ్డి ఈ బాధ్యతలు చేపట్టడం ద్వారా భారతీయ సంప్రదాయ కళా వైభవాన్ని మరింత మందికి చేరువ చేసే ప్రయత్నంలో భాగం కానున్నారు. ముఖ్యంగా మన దేశంలోని ప్రాచీన కళలు, నిర్మాణ శైలులు, చారిత్రక సంపదకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా ఆమె పాత్ర కీలకంగా ఉండనుంది.

భారతదేశంలో ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన మెట్ల బావులు (స్టెప్‌వెల్స్) మన పూర్వీకుల అద్భుతమైన నిర్మాణ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేవలం నీటి అవసరాలను తీర్చే నిర్మాణాలుగానే కాకుండా, అప్పటి ప్రజల జీవన విధానం, కళాత్మక అభిరుచి, నాగరికతకు ప్రతిబింబాలుగా ఇవి నిలిచాయి. అద్భుతమైన శిల్పకళ, ప్రత్యేక నిర్మాణ పద్ధతులు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ మెట్ల బావుల విశిష్టతను ప్రపంచానికి తెలియజేయడంలో బావోలి ఆర్ట్ సంగం ప్రత్యేక వేదికగా నిలవనుంది.

33
బావోలి ఆర్ట్ సంగం ఎప్పటి వరకు అంటే

నీరు, కళలు, నాగరికత మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించనున్నారు. అలాగే భారతీయ కళా వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, మన సంస్కృతి మూలాలపై గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బావోలి ఆర్ట్ సంగం 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపదకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అల్లు స్నేహారెడ్డి ఈ కార్యక్రమంలో కీలక బాధ్యతలు చేపట్టడం ద్వారా భారతీయ కళా వైభవాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేయనున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories