Vishwanathan and Sons Teaser: తనకంటే 20ఏళ్లు చిన్నదైన అమ్మాయితో సూర్య రొమాన్స్.. క్రేజీగా విశ్వనాథన్‌ అండ్‌ సన్స్ టీజర్‌

Published : Mar 17, 2026, 07:08 AM IST

సూర్య, మమితా బైజు జంటగా వస్తున్న 'విశ్వనాథన్ అండ్ సన్స్' టీజర్ వచ్చేసింది. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్‌తో సాగే ఈ లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా టీజర్‌ వచ్చింది. ఇది టూ క్రేజీగా ఉంది. సూర్య, మమితా మధ్య రొమాన్స్ అదిరిపోయింది.   

PREV
14
సూర్య, మమితా బైజు జంటగా విశ్వనాథన్‌ అండ్‌ సన్స్ మూవీ
వయసు తేడా, కుటుంబ సంబంధాల నేపథ్యంలో సాగే ఎమోషనల్ కామెడీ డ్రామా 'విశ్వనాథన్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సూర్య, మమితా బైజు జంటగా నటించారు. ఇది సూర్య 46వ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు.
24
విశ్వనాథన్‌ అండ్‌ సన్స్ టీజర్‌
ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, భవానీ శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ ప్రకారం, సూర్య షూటింగ్ ఛాంపియన్‌గా కనిపిస్తాడు. వయసు పెరిగాక కంటి చూపులో సమస్య వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.
34
సూర్యకి, మమితాకి 20ఏళ్ల గ్యాప్‌

తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన సూర్యను మమితా ప్రేమిస్తుంది. కానీ సూర్యకు ఆమెపై అలాంటి ఫీలింగ్స్ ఉండవు. అయినా ఆమె వెంటపడుతుంది. `ఒక చిటికె వేస్తే ఇరవై మంది కుర్రాళ్లు నీకు క్యూ కడతారని సూర్య చెప్పగా, నాలుగు చిటికెలు వేస్తాను నువ్వు పడు అని మమితా చెప్పడం క్రేజీగా ఉంది. టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

44
చిన్న పిల్లాడి చుట్టూ తిరిగే కథ

ఇందులో సూర్య చేతిలో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. అతను కొడుకు కాదు, తమ్ముడని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కథ మొత్తం ఆ పిల్లాడి చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు. వ్యాపారవేత్త విశ్వనాథ్ పెద్ద కొడుకుగా సూర్య, చిన్న కొడుకుగా ఆ పిల్లాడు కనిపిస్తారని.. వారి మధ్య డ్రామానే సినిమా అని టాక్.  టీజర్‌ ఆకట్టుకుంది. మూవీ ఎలా ఉంటుందో చూడాలి.  వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయాలని భావిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories