Suriya and Jyothika: శక్తి పీఠాలను సందర్శించిన సూర్య, జ్యోతిక జంట.. అమ్మవార్ల ఆశీర్వాదంతో కొత్త సినిమా!

Published : Apr 21, 2025, 01:56 PM ISTUpdated : Apr 21, 2025, 02:03 PM IST

Suriya and Jyothika: తమిళ్‌, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన యాక్టర్‌ సూర్య, అతని సతీమణి జ్యోతిక కలిసి కొల్హాపూర్‌లోని శక్తిపీఠాలను సదర్శించారు. లవ్‌లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు.. వరుస సినిమాలతో ఎవరికి వారు బిజీ అయ్యారు. తాజాగా ఒకరు నటించిన సినిమా విడుదలకు సిద్దం కాగా.. మరొకరి సినిమా ప్రారంభమానికి సిద్దమైంది. ఈ సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు సూర్య, జ్యోతిక.   

PREV
15
Suriya and Jyothika: శక్తి పీఠాలను సందర్శించిన సూర్య, జ్యోతిక జంట.. అమ్మవార్ల ఆశీర్వాదంతో కొత్త సినిమా!
Suriya Jyothika Seek Blessings at Shakti Peethas Ahead of Upcoming Film Releases

జ్యోతిక నటించిన ''డబ్బా కార్టెల్‌'' వెబ్‌సిరీస్‌ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది. జ్యోతిక నటను అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ క్రైమ్ డ్రామా సిరీస్‌లో షబానా అజ్మీ, షాలిని పాండే, అంజలి ఆనంద్, నిమిషా సజయన్‌లతో కలిసి జ్యోతిక నటించింది. ఈ సినిమా విజయంతో.. రీసెంట్‌గా తన భర్త సూర్యతో కలిసి కొల్హాపూర్ మహాలక్ష్మి, కామాఖ్య ఆలయ శక్తి పీఠాలను సందర్శించింది.

25
Suriya Jyothika

ఇక సూర్య విషయానికి వస్తే గత చిత్రం కంగువాతో  ప్రేక్షకులను నిరాశ పరిచాడు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అయితే.. త్వరలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల కాగా.. మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. 

35
Suriya Jyothika

ఇప్పటికే జ్యోతిక ఇటీవల నటించిన వెబ్‌సిరీస్‌ డబ్బా కార్టెల్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తుండగా.. త్వరలో మరోప్రాజెక్టులో అజయ్ దేవ్‌గన్‌తో కలిసి షైతాన్ 2లో అశ్విని అయ్యర్ తివారీతో కలిసి జ్యోతిక నటించబోతోంది. అయితే... ఈ సినిమాకు పేరు పెట్టలేదు. కానీ  అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇక ఈ సినిమా విజయవంతం కావాలని  కొల్హాపూర్ మహాలక్ష్మి, కామాఖ్య ఆలయ అమ్మావారిని మొక్కుకున్నట్లు జ్యోతిక చెబుతోంది. 

45
Jyothika Upcoming Film

సూర్య, జ్యోతిక కలిసి  కొల్హాపూర్ మహాలక్ష్మి, కామాఖ్య ఆలయ శక్తిపీఠాలను సందర్శించిన ఫొటోలను జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. త్వరలో వారు నటించిన చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో అమ్మావార్ల ఆశీర్వాదం తీసుకునేందుకు ఆలయానికి వచ్చినట్లు పోస్టు చేశారు జ్యోతిక. "శుభకరమైన నూతన సంవత్సరంలో కొల్హాపూర్ మహాలక్ష్మి, కామాఖ్య పవిత్ర శక్తి పీఠాలను సందర్శించడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను..! నా తదుపరి చిత్రం ప్రారంభిస్తున్నాను... మీ ప్రేమ, బెస్లింగ్స్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని జ్యోతిక తన పోస్టులో పేర్కొంది. ఆలయంలో అమ్మావారి దర్శనానికి వచ్చిన జ్యోతిక ఎరుపు రంగు చీరను కట్టుకుని అందరినీ ఆకట్టుకున్నారు. 

 

55
Jyothika Upcoming Film

ఇటీవల సూర్య నటించిన రెట్రో ట్రైలర్‌ లాంచ్‌ సందర్బంగా తన భార్య జ్యోతిక గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. జ్యోతిక గురించి మాట్లాడుతూ.. ఆమెను తన 'కన్నడి పూ' అంటే గాజు పువ్వు అని పిలిచాడు. జ్యోతిక లేకుంటే తన ప్రయాణం ఇంత ఆనందంగా ఉండేది కాదని సూర్య అన్నాడు.. జ్యోతికకు ధన్యావాదలు తెలిపారు. ఇక రెట్రో సినిమా గురించి మాట్లాడుతూ.. "సినిమాలో లవ్‌, కామెడీ, వార్‌ ఇలా అనేక అంశాలు ఉంటాయని, అందరూ ఇస్టపడతారని తెలిపారు. అభిమానుల గురించి మాట్లాడుతూ.. ''మీ అందరి వల్ల నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. మీ ప్రేమ వల్ల నేను ఇక్కడ ఉన్నాను'' అని సూర్య ఫ్యాన్స్‌కి థ్యాంక్స్‌ చెప్పాడు. 

Read more Photos on
click me!

Recommended Stories