పెళ్లైన హీరోతో ఎఫైర్.. కెరీర్ ను నాశనం చేసుకున్న హీరోయిన్... ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

First Published Jun 11, 2024, 5:57 PM IST

స్టార్ హీరోతో ఏఫైర్.. ఓ హీరోయిన్ కొంప ముంచింది. తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసినా.. కన్నడ, తమిళంలో ఆమె పేరు కాస్త మారు మోగింది. ఓ స్టార్ హీరోతో  ఆమె నడిపించిన ప్రేమాయనం ఆమెకు మూవీ కెరీర్ లేకుండా చేసింది. ఇంతకీ ఎవరామె. 

Nikita Thukral

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి లైఫ్ లు ఒకే రకంగా ఉండవు. కొందరి జీవితాలు హ్యాపీగా సాగిపోతే.. మరికొందరివి మాత్రం వివాదాలు, చికాకుల లైఫ్ గా మారిపోతుంటాయి. వారు చేసిన కొన్ని పనులు కారణంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు తారలు. అందులో హీరోయిన్లు ఎక్కువమంది తమ లైఫ్ ను స్పాయిల్ చేసుకున్నారు.  వ్యక్తిగత జీవితంలో చేసిన కొన్ని తప్పుల కారణంగా కెరీర్‌ను నాశనం చేసుకున్న హీరోయిన్లు కొందరు ఉన్నారు. 
 

Nikita Thukral

ఇలాంటి కోవలోకే వస్తుంది హీరోయిన్  నిఖితా తుక్రాల్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఆల్రెడీ పెళ్లయిన ఒక కో-యాక్టర్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం బయటకు రావడంతో ఫ్యాన్స్‌కు ఆమెపై గౌరవం పోయింది. తర్వాత నిఖిత ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది.

Nikita Thukral

ముంబైలో పుట్టి పెరిగిన నిఖిత, ఎంఏ చదివింది. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కంట పడటంతో.. ఆమెలో  ప్రతిభను గుర్తించి, హాయ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు ఆతరువాత వరుసగా అవకాశాలు వచ్చిపడ్డాయి.  తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. దీనికంటే ముందు ఘటోత్కచుడు (1995)లో బేబీ నిఖితగా ఆమె ఆలరించింది. 
 

తెలుగులో హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది నిఖిత.  కళ్యాణ రాముడు, సంబరం, ఖుషి ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, చింతకాయల రవి, అవును 2 వంటి హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగుతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో డజన్ల కొద్దీ సినిమాలు చేసింది నిఖిత. కాని ఆమె కెరీర్ లో చేసిన పెద్ద తప్పు... ఇండస్ట్రీ నుంచి బయటకు గెంటేలా చేసింది. 

Nikita Thukral

పెళ్లయిన హీరోతో ఎఫైర్ పెట్టుకోవడంతో నిఖిత కెరీర్  పాడైంది. నిఖిత  కన్నడ నటుడు దర్శనంతో రిలేషన్ షిప్ ను మెయింటేన్ చేసింది. ఇద్దరు ఇష్టపడటంతో ఇండస్ట్రీ కోడై కూసింది.   కన్నడ నటుడు దర్శన్‌తో ప్రేమలో పడింది నిఖిత.  అప్పటికే దర్శన్‌కు పెళ్లయింది. తర్వాత ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. ఇక అక్కడ నుంచి వరుస వివాదాలు ఆమెను చుట్టు ముట్టాయి. ఇండస్ట్రీలో ఇబ్బందులుతప్పలేదు. 
 

dharshan

నటుడి భార్య తన భర్త వ్యవహారంపై పోలీసులకు కంప్లైయింట్ కూడా చేసింది. దర్శన్ గృహ హింసకు పాల్పడుతున్నాడని  తనపై తుపాకీ చూపి చంపేస్తానని భర్త బెదిరించాడని భార్య ఆరోపించింది.  కేసు వేయడంతో  దర్శన్ అరెస్ట్ కూడా అయ్యారు. దీని తర్వాత సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేగడంతో కన్నడ సినీ నిర్మాతల సంఘం నికితాపై మూడేళ్ల పాటు నిషేధం విధించింది. 
 

కొన్ని నెలల తర్వాత నిషేధం ఎత్తివేయబడినప్పటికీ, అప్పటికి నికితా తుక్రాల్ దర్శకుల దృష్టిలో  వివాదాస్పద నటిగా ముద్ర పడిపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు రాలేదు.  సినిమా రంగానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.తరువాత, నటి 2017 లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుంది. సినిమా ప్రపంచానికి పూర్తిగా దూరమైన నికిత.. ఇప్పుడు ఓ కూతురికి తల్లి అయి కుటుంబంతో హ్యాపీగా గడుపుతోంది.

Latest Videos

click me!