సుప్రీతను హీరోయిన్ చేయాలి అనేది సురేఖావాణి కల. అది ఎట్టకేలకు నెరవేరుతుంది. సోషల్ మీడియాలో సురేఖావాణి, సుప్రీత చాలా పాప్యులర్. ఇంస్టాగ్రామ్ వేదికగా వీరు గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు చేస్తుంటారు. అవి వైరల్ అవుతుంటాయి. కూతురిని హీరోయిన్ చేయాలనే ఆలోచనతో సురేఖావాణి ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమెను పాప్యులర్ చేసింది. సుప్రీత ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని కూడా లక్షల మంది ఫాలో అవుతున్నారు. అప్పుడప్పుడు సుప్రీత ఫ్యాన్స్ తో చాట్ చేస్తుంది.