ప్రేమికుడిని మార్చేసిన ఫైమా... ఆ జబర్దస్త్ కమెడియన్ ముఖానే అడిగేశాడుగా!

First Published | Mar 28, 2024, 2:29 PM IST


జబర్దస్త్ ఫైమా కొన్నాళ్లుగా కమెడియన్ ప్రవీణ్ ని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫైమా లవర్ ని మార్చేసినట్లు తాజా ఘటనతో తెలుస్తుంది. 
 

Faima

జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లలో ఫైమా ఒకరు. తన మార్క్ కామెడీ, డైలాగ్ డెలివరీ క్రియేట్ చేసుకున్న ఫైమా స్టార్ కమెడియన్స్ లో ఒకరిగా ఎదిగింది. పలువురు టీమ్ లీడర్స్ తో ఫైమా పని చేసింది. 

బిగ్ బాస్ షోలో ఆమెకు ఆఫర్ వచ్చింది. 2022లో ప్రసారమైన సీజన్ 5లో పాల్గొన్న ఫైమా సత్తా చాటింది. ఫైమా రెండు మూడు వారాలు ఉండటమే కష్టం అనుకున్నారందరూ. కానీ స్ట్రాంగ్ ప్లేతో ఏకంగా 13 వారాలు హౌస్లో ఉంది. ఫైమా ఆట తీరు చాలా మందిని ఆశ్చర్య పరిచింది. 


Faima-Praveen

బిగ్ బాస్ హౌస్లో ఫైమా తన ప్రియుడు పేరు చెప్పింది. పటాస్  ప్రవీణ్ తనకు అత్యంత ఆప్తుడు. ఆమెను కష్టాల్లో ఆదుకున్నాడని ఓపెన్ అయ్యింది. హౌస్ నుండి బయటకు వచ్చిన ఫైమాకు ప్రవీణ్ గ్రాండ్ వెల్కమ్ పలికాడు. ఇంటికి వెళ్లి పలకరించాడు. తన మెడలో ఉన్న చైన్ బహూకరించాడు. 

Faima-Praveen

కొన్నాళ్ళు వీరి బంధం సవ్యంగానే సాగింది. కారణం తెలియదు కానీ... ఫైమా ప్రవీణ్ ని దూరం పెట్టిందట. ఈ విషయాన్ని ప్రవీణ్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆమెకు ఇష్టం అయితే కలిసి ఉంటానని అన్నాడు. ఫైమా మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. 

Faima-Praveen

ప్రవీణ్ ని వదిలేసినా ఫైమా కొత్త లవర్ ని వెతుక్కున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఓ జబర్దస్త్ కమెడియన్ హింట్ ఇచ్చాడు. జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చిన ఫైమా... బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ లో చేస్తుంది. తాజా ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్ ఫైమాను ఉద్దేశిస్తూ... 'లవర్స్ మార్చేసినంత ఈజీ కాదు', అన్నాడు. 

ఈ క్రమంలో ప్రవీణ్ కి హ్యాండ్ ఇచ్చిన ఫైమా కొత్త లవర్ ని సెట్ చేసుకుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ కొత్త లవర్ ఎవరనేది మాత్రం సస్పెన్సు. అగ్రిమెంట్ కారణంగా కొన్నాళ్ళు ఫైమా స్టార్ మా కే పరిమితం అయ్యింది. అగ్రిమెంట్ ముగియడంతో రీ ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ లో సందడి చేస్తుంది. 

Latest Videos

click me!