Annaatthe(Peddanna): రజనీ 'పెద్దన్న' మూవీ ట్విట్టర్ రివ్యూ.. అసలైన మజా అదే

First Published Nov 4, 2021, 7:49 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే తమిళనాడులో పండుగ వాతావరణం. అదే దీపావళి లాంటి పండుగ రోజున విడుదలైతే అభిమానుల సంబరాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే తమిళనాడులో పండుగ వాతావరణం. అదే దీపావళి లాంటి పండుగ రోజున విడుదలైతే అభిమానుల సంబరాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. తెలుగులో కూడా పెద్ద ఎత్తున రజనీ చిత్రాలు విడుదలవుతుంటాయి. రజనీ, వరుస విజయాల దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పెద్దన్న(Annaatthe). మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

Diwali కానుకగా Peddanna చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో రజనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా థియేటర్స్ నుంచి సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న పెద్దన్న చిత్రానికి ట్విట్టర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూద్దాం. 

ట్రైలర్, టీజర్ లో SuperStar Rajinikanth 'నరసింహ' తరహాలో స్టైలిష్ గా కనిపించారు. చిత్ర యూనిట్ కూడా పెద్దన్న చిత్రంలో వింటేజ్ రజనీని చూస్తారు అంటూ ప్రమోషన్స్ లో తెలిపింది. సినిమాలో రజనీ నిజంగానే వింటేజ్ లుక్ లో అదరగొట్టారు. 

పెద్దన్న చిత్రంలో కొన్ని మాస్ సన్నివేశాలు, ఎలివేషన్ సీన్స్ అదిరిపోయినట్లు ట్విట్టర్ జనాలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. రజనీ మాస్ టైమింగ్ ని దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బి, సి సెంటర్స్ లో పూనకాలు తెప్పించేలా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉందట. 

ఇక హీరోయిన్ గా నటించిన Nayanthara రీసెంట్ టైమ్స్ లో చాలా అందంగా కనిపించినట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు శివ దశాబ్దాల క్రితం నటి పాత కథని పట్టుకొచ్చారు అంటూ ట్విట్టర్ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో చూసేసిన పాత కాలం కథ. తర్వాతి సన్నివేశం ఏంటో ఇట్టే పసిగట్టేయొచ్చు అని అంటున్నారు. 

దర్శకుడు శివ మంచి కథ సిద్ధం చేసుకోవడంలో విఫలం అయ్యారని అంటున్నారు. కామెడీ కూడా అవుట్ డేటెడ్ గా ఉంటుంది. సెంటిమెంట్ సన్నివేశాలు అతిగా పెట్టడం వల్ల థియేటర్స్ లో జనాలు నీరసంగా ఫీలవుతారు అని అంటున్నారు. 

రజనీ అభిమానులు ఇది మాస్ కి చేరువయ్యే చిత్రం అని అంటుంటే.. కొందరు యావరేజ్ ఫిలిం అంటున్నారు. దర్శకుడు శివ ఇకనుంచి అయినా స్టోరీ టెంప్లేట్ మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ పూర్తిగా విఫలమైందని శివపై విమర్శలు చేస్తున్నారు. 

కొత్తగా ఏమీ ఊహించవద్దు.. అన్ని సన్నివేశాలు శివ గత చిత్రాలని తలపిస్తాయి. రజనీకాంత్ తన స్టార్ పవర్, పెర్ఫామెన్స్ తో సినిమాని చాలా వరకు సేవ్ చేశారు. ఇమాన్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకోలేకపోయింది అంటూ ట్విట్టర్ లో పెద్దన్న చిత్రంపై కామెంట్స్, రివ్యూలు వస్తున్నాయి. ఓవరాల్ గా ఇది పూర్తిగా రజనీ క్రేజ్ పై డిపెండ్ అయిన చిత్రం. దీపావళి పండుగ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. 

click me!