ఆ మూవీ హిట్ అయితే మహేష్ ఎప్పటికీ స్టార్ కాలేడు.. మైండ్ బ్లాక్ అయ్యేలా కృష్ణ జడ్జిమెంట్, దటీజ్ సూపర్ స్టార్

Published : Nov 15, 2022, 08:07 AM IST

ఆయన వెండితెరపై చేయని సాహసాలు, ప్రయోగాలు లేవు. సినిమా కోసం ఎడారుల్లో రోజుల తరబడి గడిపిన బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

PREV
17
ఆ మూవీ హిట్ అయితే మహేష్ ఎప్పటికీ స్టార్ కాలేడు.. మైండ్ బ్లాక్ అయ్యేలా కృష్ణ జడ్జిమెంట్, దటీజ్ సూపర్ స్టార్

ఆయన వెండితెరపై చేయని సాహసాలు, ప్రయోగాలు లేవు. సినిమా కోసం ఎడారుల్లో రోజుల తరబడి గడిపిన బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అనారోగ్యం కారణంగా సోమవారం ఆసుపత్రిలో కృష్ణ చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారు జామున ఆయన మృతి చెందినట్లు కాంటినెంటల్ వైద్యులు ప్రకటించారు. 

27
Super star krishna

దీనితో టాలీవుడ్ మొత్తం విషాదమయంగా మారింది. కృష్ణ దాదాపు 340 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ ని కాదని ఆయన చేసిన అల్లూరి సీతారామరాజు చిత్రం తెలుగు సినిమా ఉన్నంత కాలం ఉంటుంది. టాలీవుడ్ జేమ్స్ బాండ్, కౌబాయ్ ఆయనే. కృష్ణ మరణంతో విషాదంలో మునిగిన అభిమానులు ఆయన చిత్రాలని గుర్తు చేసుకుంటున్నారు. కథల విషయంలో తన తండ్రి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

37

తొలిసినిమా తర్వాతి నుంచి కథల విషయంలో మహేష్ బాబే నిర్ణయం తీసుకుంటాడట. నాన్నగారు ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. నీ కష్టం నువ్వే పడాలి అని చెప్పేవారట. మురారి ప్రీవ్యూని నాన్నగారితో కలసి చూశా. సినిమా పూర్తి కాగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా భుజంపై సంతోషంతో అలా తట్టారు. ఆయనకి సినిమా, నా యాక్టింగ్ అమితంగా నచ్చింది అని అర్థం ఐంది. నా లైఫ్ లో అదే పెద్ద కాంప్లిమెంట్ అని మహేష్ తెలిపాడు. 

47

బాగాలేనప్పుడు విమర్శలు కూడా చేస్తుంటారు. 'నాని' నేను నటించిన ప్రయోగాత్మక చిత్రం. ఆ మూవీ ప్రివ్యూని నాన్నగారికి చూపించాం. మూవీ పూర్తయ్యాక నాన్న చెప్పిన మాటలు నాకు వేకప్ కాల్ లాంటివి. 'ఈ సినిమా హిట్ అయితే మహేష్ ఎప్పటికీ స్టార్ కాలేడు' అని అన్నారట. అంటే దానర్థం ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా కాదు ఇది అని. నాన్న చెప్పినట్లుగానే ఆ చిత్రం బాగా ఆడలేదు. నాన్న మాటల ద్వారా ఒక స్టార్ హీరో ఎలాంటి సినిమాలు చేయాలో, ఎలాంటివి చేయకూడదో తెలుసుకున్నా.

57

నాన్న ఎక్కువ మాట్లాడడం తక్కువ మాట్లాడడం ఉండదు. ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. మహేష్ బాబు నటన చూసి కృష్ణ ఎప్పుడూ మురిసిపోతుంటారు. మహేష్ పెద్ద స్టార్ అవుతాడని చిన్నతనంలోనే చాలా మంది సినీ ప్రముఖులు చెప్పినట్లు కృష్ణ ఒక సందర్భంలో తెలిపారు. 

67

ఇక మహేష్ తన తండ్రి గురించి చెబుతూ నాన్న ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ ఇంట్లో మాతో చాలా సింపుల్ గా ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నా మాకోసం టైం కేటాయించేవారు. ఇప్పుడు నా పిల్లల కోసం నేను అదే చేస్తున్నా అని మహేష్ తెలిపాడు. 

77

ఇంతటి గొప్ప జీవితానికి ఒక అర్థం ఇచ్చిన తన తండ్రి మరణంతో మహేష్ తీవ్ర దిగ్బ్రాంతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు, కృష్ణ కలసి కొడుకు దిద్దిన కాపురం , వంశీ , పోరాటం, టక్కరి దొంగ లాంటి చిత్రాల్లో నటించారు. 

click me!

Recommended Stories