Krishna: సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ ను కంప్లీట్ గా మార్చేసిన సినిమా ఏదో తెలుసా? ఆయన సినీ జీవితంలో వరుసగా 20 అవకాశాలను తెచ్చిపెట్టినమూవీ గురించి ఎంత మందికి తెలుసు? ఇంతకీ ఆ సినిమా స్పెషల్ ఏంటి? Superstar Krishna The 1966 Classic Movie Gudachari 116
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాకు దొరికిన రత్నం.. ఆయన వల్లే టాలీవుడ్ సినిమా టెక్నికల్ హంగులు అద్దుకుంది. ఇండస్ట్రీలో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు చేసిన సూపర్ స్టార్.. ఎన్నో రికార్డులు కూడా సాధించాడు. సాహసానికి మారుపేరుగా ఉండేవారు కృష్ణ. ఆయన కెరీర్ లో చేసిన ప్రయోగాలు ఎన్నో. తను నష్టపోయినా.. నిర్మాతలు బాగుండాలని కోరుకున్న హీరో కృష్ణ మాత్రమే. ఇండస్ట్రీలో కృష్ణను దేవుడు అంటారు.
25
ఎన్టీఆర, ఏఎన్నార్ కు పోటీ ఇస్తూ..
సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలిచిన అపూర్వ చిత్రం 'గూఢచారి 116'. తెలుగు సినీ రంగాన్ని ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు శాసిస్తున్న రోజుల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాలతో పాటు, ఆ రోజుల్లోనే సాహసోపేతమైన యాక్షన్, స్పై థ్రిల్లర్ సినిమాలతో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘గూఢచారి 116’ సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను.. ఆయన చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
35
'గూఢచారి 116' వెనుక అసలు కథ
దర్శకుడు మల్లికార్జునరావు తొలినాళ్లలో ప్రముఖ నిర్మాత సుందర్‌లాల్ నహతా సంస్థలో బాధ్యతలు నిర్వర్తించేవారు. ఆయన పనితనంపై నహతాకి ఎంతో నమ్మకం ఉండేది. మొదట 'శాంతి నివాసం' చిత్రానికి మల్లికార్జునరావుని దర్శకుడిగా అనుకున్నప్పటికీ, చివరి క్షణాల్లో ఆ అవకాశం వేరే దర్శకుడికి దక్కింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురైనప్పటికీ, ధైర్యంగా ముందుకు సాగారు. ఆ తర్వాత, కృష్ణ హీరోగా 'గూఢచారి 116' చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమయంలో నిర్మాత డూండీని ఒప్పించడం చాలా క్లిష్టమైన విషయం. మల్లికార్జునరావు గారు పట్టుబట్టి, వారిని ఒప్పించి ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు.
ఈ సాహసోపేత చిత్రం విడుదలవుతూనే బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సాధించిన సంచలన విజయం కృష్ణ సినీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజే కృష్ణ ఏకంగా 20 సినిమాలకు సంతకం చేయడం విశేషం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక్క రోజే ఇన్ని చిత్రాలకు ఓ నటుడు కమిట్ కావడం ఇప్పటికీ చెరిగిపోని ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. ఇంత వరకూ ఈ రికార్డును ఏ హీరో బ్రేక్ చేయలేకపోయాడు.
55
టాలీవుడ్ లో కృష్ణ మార్క్..
టాలీవుడ్ లో తన మార్క్ చూపించుకోవడం కోసం కృష్ణ చాలా ప్రయోగాలు చేశాడు. తెలుగు పరిశ్రమను కొత్తదనం వైపు నడిపించాడు. కొత్త టెక్నాలజీలు పరిచయం చేశాడు. డిఫరెంట్ జానర్ లో సినిమాలు ప్రయత్నించాడు. యాక్షన్ సీన్స్, కౌబాయ్ మూవీస్, జేమ్స్ బాండ్ మూవీస్, కలర్ స్క్రీన్, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ తో పాటు.. రకరకాల పాత్రను ప్రయత్నించి.. తెలుగు ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా టాలీవుడ్ లో ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు.