సంక్రాంతి బరిలో సూపర్‌ స్టార్‌ కృష్ణతో పోటీ పడి కోలుకోలేని దెబ్బతిన్న వెంకటేష్‌, రోజా, శోభన్‌ బాబు సినిమాలివే

Published : Jan 12, 2026, 10:41 AM ISTUpdated : Jan 12, 2026, 12:25 PM IST

SuperStar Krishna:  అప్పట్లో కృష్ణతో పోటీ అంటే అది మామూలుగా ఉండదు. అలా సూపర్‌ స్టార్‌తో పోటీ పడి విక్టరీ వెంకటేష్‌, సోగ్గాడు శోభన్‌ బాబు కోలుకోలేని దెబ్బతిన్నారు. మరి అది ఎప్పుడు? ఆ సినిమాలేంటి అనేది చూద్దాం.  

PREV
15
సంక్రాంతికి కృష్ణతో పోటీ పడ్డ చిత్రాలివే

అప్పట్లో సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎన్టీఆర్‌ తర్వాత అంతటి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. చాలా ఏళ్ల పాటు రామారావుకి పోటీ ఇచ్చారు. మాస్‌ కమర్షియల్‌ చిత్రాలతో బాక్సాఫీసుని పరుగులు పెట్టించారు. అయితే ఆయన సినిమాలు సంక్రాంతికి చాలానే విడుదలయ్యాయి. కానీ సక్సెస్‌ అయిన మూవీస్‌ చాలా తక్కువ. అలా సంక్రాంతి పోటీలో దిగి దుమ్మురేపిన మూవీస్‌లో `అమ్మ దొంగ` ఒకటి. ఈ మూవీకి పోటీగా విడుదలైన వెంకటేష్‌, శోభన్‌ బాబు, అశ్వినీ నాచప్ప చిత్రాలు అడ్రస్‌ లేకుండా పోయాయి. అవేంటో తెలుసుకుందాం.

25
అమ్మదొంగతో కృష్ణని నిలబెట్టిన దర్శకుడు సాగర్‌

కృష్ణ ఘట్టమనేని హీరోగా 1995లో సంక్రాంతికి విడుదలైన మూవీ `అమ్మ దొంగ`. దీనికి సాగర్‌ దర్శకత్వం వహించారు. ఇందులో సూపర్‌ స్టార్‌కి జోడీగా సౌందర్య, ఆమని, ఇంద్రజ హీరోయిన్లుగా నటించారు. మౌళి క్రియేషన్స్ పతాకంపై సిహెచ్‌ సుధాకర్‌ బాబు, భారతీదేవి మౌళి నిర్మించారు. 1995 జనవరి 12న ఈ చిత్రం విడుదలైంది. కోటి ఈ మూవీకి సంగీతం అందించడం విశేషం. రాజ్‌ కోటి ద్వయం నుంచి విడిపోయి కోటి సంగీతం అందించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది. కృష్ణ అంతకు ముందు సాగర్‌ దర్శకత్వంలో `నంబర్‌ వన్‌` మూవీతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఆ తర్వాత నటించిన ఐదు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయం చెందాయి. దీంతో మరోసారి సాగర్‌తో కలిసి ఈ మూవీ చేశారు. ఇది బాక్సాఫీసుని షేక్‌ చేసి కృష్ణని గట్టెక్కించింది. దీనికి పోటీగా వచ్చిన చిత్రాలను చిత్తు చేసింది.

35
`పోకిరా రాజా` వెంకీకి కోలుకోలేని దెబ్బ

కృష్ణ `అమ్మ దొంగ` మూవీకి పోటీగా వచ్చి చిత్తైన సినిమాల్లో వెంకటేష్‌ నటించిన `పోకిరీ రాజా` ప్రధానంగా ఉంది. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రోజా హీరోయిన్‌. సంక్రాంతికి కానుకగా జనవరి 12నే ఇది కూడా రిలీజ్‌ అయ్యింది. ఓ రకంగా కృష్ణ `అమ్మ దొంగ`కి పోటీగా వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌ గా నలిచింది. దీనికి రాజ్‌ కోటి సంగీతం అందించడం విశేషం. ఈ మూవీ కంటే ముందే వెంకీకి `ముద్దుల ప్రియుడు` డిజప్పాయింట్‌ చేసింది. `పోకిరా రాజా`తో ఎలాగైనా హిట్‌ కొట్టాలనుకున్నారు. కానీ ఫలితం తేడా కొట్టింది. కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. 

45
డిజప్పాయింట్‌ చేసిన అశ్వినీ నాచప్ప `మిస్‌ 420`

ఇక సంక్రాంతి బరిలో కృష్ణ `అమ్మ దొంగ`తో పోటీ పడ్డ మరో మూవీ `మిస్‌ 420`. మౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో అశ్వినీ నాచప్ప, రాజ్‌ కుమార్‌ జంటగా నటించారు. మౌళి దర్శకుడు. ఈ యాక్షన్‌ ఎమోషనల్‌ ఫిల్మ్ కూడా అదే రోజు వచ్చింది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

55
సోగ్గాడికి కూడా ఊహించని షాక్‌

వీటితోపాటు సోగ్గాడు శోభన్‌ బాబుని కూడా కృష్ణ `అమ్మ దొంగ` దెబ్బ కొట్టింది. సోగ్గాడు నటించిన `ఆస్తి మూరెడు ఆశ బారెడు` చిత్రం రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. ఇందులో శోభన్‌ బాబు, జయసుధ జంటగా నటించారు. దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తూ ముఖ్య పాత్ర పోషించారు. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ఇది రూపొంది బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. అప్పటికే థియేటర్లలో కృష్ణ `అమ్మ దొంగ` రన్‌ అవుతుండటంతో ఆ ప్రభావం ఈ మూవీపై పడింది. ఇలా `అమ్మ దొంగ` కారణంగా అప్పటికే ఫ్లాప్‌లో ఉన్న వెంకటేష్‌, సోగ్గాడికి మరో దెబ్బ పడిందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories