Jabardasth : చేపల కొట్టు క్లోజ్ చేసిన కిరాక్ ఆర్పీ, లాభాలు వచ్చే బిజినెస్ ను ఎందుకు మూసేశాడంటే..?

Published : Jan 12, 2026, 10:10 AM IST

జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. బిజినెస్ మేన్ గా మారిపోయాడు కిరాక్ ఆర్పీ.. రీసెంట్ గా ఆ వ్యాపారాలను కూడా సడెన్ గా క్లోజ్ చేశాడు. ఆర్పీ నిర్ణయం వెనుక కారణం ఏంటి? ఏం చేయబోతున్నాడు.? 

PREV
15
జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి..

జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఎక్కడెక్కడో మారుమూల ఉన్నవారినిక కూడా స్టార్ కమెడియన్స్ గా మార్చింది. అలాంటి వారిలో కిరాక్ ఆర్పీ ఒకడు. ఎక్కడో నెల్లూరు విలేజ్ నుంచి వచ్చి.. జబర్దస్త్ లో సాధారణ కమెడియన్ గా కెరీర స్టార్ట్ చేశాడు ఆర్పీ.. ఆతరువాత టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. జబర్దస్త్ లో చేస్తూనే సినిమా అవకాశాలు సాధించి.. కొన్ని సినిమాల్లో నటించాడు. ఆతరువాత దర్శకుడిగా మారి ఒకటి రెండు సినిమాలను కూడా డైరెక్ట్ చేశాడు. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. దాంతో బిజినెస్ లోకి దూకాడు. ఎప్పుడూ.. స్కిట్స్ లో నెల్లూరు..నెల్లూరు.. అంటూ ఊతపదంగా వాడే ఆర్పీ.. నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో భారీ స్థాయిలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు.

25
తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులసు శాఖలు.. ‘

కిరాక్ ఆర్పీ ఒక దశలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులసు పేరుతో భారీ స్థాయిలో ఫుడ్ బిజినెస్ ప్రారంభించాడు.. ఈ షాపులు ఓపెన్ చేసే టైమ్ లో సెలబ్రిటీలను పిలిచి హల్ చల్ చేశాడు. వారిని ఆదుకుంటాను.. వీరిని ఆదుకుంటాను అంటూ.. తెగ హడావిడి చేశాడు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ఈ కర్రీ పాయింట్లు ఏర్పాటు చేశాడు. అంతేకాదు.. ఆసక్తితో ముందుకు వచ్చినవారికి ఫ్రాంఛైజీలు కూడా ఇచ్చి వ్యాపారాన్ని విస్తరించాడు. సోషల్ మీడియాలో ఈ బిజినెస్ పై భారీగా ప్రచారం కూడా చేశాడు ఆర్పీ.. జబర్దస్త్ ఇమేజ్ తో.. ఇంకాస్త ఎక్కువ పబ్లిసిటీ వచ్చి.. ఈ పులుసు కొనడానికి జనాలు ఎగబడ్డారు.

35
ఆర్పీ చేపల పులుసుకు నెగెటీవ్ టాక్..

నెల్లూరు స్టైల్ పులుసు అని పెద్దగా ప్రచారం చేసినా.. ఆర్పీ కర్రీపాయింట్ కు పేరు రాలేదు.. మొదలు పెట్టిన రోజుల్లో జనాలు ఎగబడ్డారు.. పెద్ద సంఖ్యలో ఈ పులుసు రుచి చూడటానికి క్యూ కట్టారు. మసాలా దినుసులు ప్రత్యేకం అని.. వంటవాళ్లు నెల్లూరు నుంచి వస్తారని.. ఈ టేస్ట్ ఎక్కడా ఉండదని.. సోషల్ మీడియా ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ.. చెప్పాడు కిరాక్ ఆర్పీ. కానీ ఎంత ప్రచారం చేసినా.. ఈ పులుసుపై మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. కొంతమంది కస్టమర్లు కర్రీ అస్సలు బాలేదని చెప్పేశారు.. కొంత మంది రేట్లు ఎక్కువ అని అన్నారు. అయినా అవన్నీ... పట్టించుకోకుండా ఆర్పీ తన బిజినెస్ ను పెంచుకుంటూ వెళ్లాడు..

45
సడెన్ గా బిజినెస్ క్లోజ్ చేసన ఆర్పీ..

ఆర్పీ పెద్ద బిజినెస్ మేన్ అయిపోయాడు అని అంతా అనుకున్న టైమ్ లో.. సడెన్ గా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులసు బిజినెస్ ను క్లోజ్ చేసి షాక్ ఇచ్చాడు. దీనికి కారణం ఏంటీ అనే ప్రశ్నలు జనాలలో మొదలయ్యాయి. బాగా నడిచే వ్యాపారం ఒక్కసారిగా ఎందుకు మూసేశాడనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయంలో కిర్రాక్ ఆర్పీ.. రీసెంట్ గానే ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలక్షన్స్ టైమ్ నుంచి ఆర్పీ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. టీడీపీ తరఫున బాగా ప్రచారం చేశాడు. వైసీపీ వాళ్లను రకరకాలుగా విమర్శిస్తూ.. రోజాను గట్టిగా టార్గెట్ చేసి వీడియోలు చేశాడు. ఇలా రాజకీయాల్లో బిజీగా ఉండటంతోనే.. టైమ్ లేక చేపల పులుసు వ్యాపారం పూర్తిగా క్లోజ్ చేశాడట.

55
పూర్తిగా రాజకీయాల్లోకి కిరాక్ ఆర్పీ

జీవిత ప్రయాణంలో ఫుడ్ బిజినెస్ కూడా ఒక భాగమేనని, రాజకీయాలు కూడా మరో భాగమని ఆర్పీ అన్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో పూర్తిగా బిజీ కావడం వల్లే చేపల పులసు బిజినెస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు రాజకీయాల్లో ఇంకా బిజీ అవ్వాలని చూస్తున్నాడట ఆర్పీ.. టీడీపీ తరపున ఏదైనా పదవి ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నాడట. ఆర్పీ చేసిన ప్రచారానికి ఫలితంగా అతనికి ఏదో ఒక పదవి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. బిజినెస్ వదిలేసుకుని మరీ రాజకీయాల్లోకి వెళ్లిన ఆర్పీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూడాలి మరి.

Read more Photos on
click me!

Recommended Stories