పళ్ళు పోయిన నటుడు అంటూ రజనీకాంత్ పై తీవ్ర వ్యాఖ్యలు.. సూపర్ స్టార్ సమాధానం ఇదే

First Published | Aug 26, 2024, 12:25 PM IST

నటుడు రజనీకాంత్, డీఎంకే నాయకుడు దురైమురుగన్ మధ్య జరిగిన వాగ్యుద్ధం వివాదాస్పదమైంది. రజనీ వ్యాఖ్యలకు దురైమురుగన్ తీవ్రంగా స్పందించగా, ఈ విషయంపై రజనీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రజనీ కామెడీ స్పీచ్

చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన నటుడు రజనీకాంత్, పాఠశాలలో కొత్త విద్యార్థులను సర్దుబాటు చేసుకోవడం తేలికే. కానీ, పాత విద్యార్థులను సర్దుబాటు చేసుకోవడం కష్టం. ఇక్కడ(డీఎంకే) చాలా మంది పాత వాళ్ళు ఉన్నారు.కొంతమంది వృద్ధ పొలిటిషన్స్ ఎప్పటికి విడిచి వెళ్ళరు. వీళ్ళందరినీ సర్దుబాటు చేసుకోవడం మామూలు విషయం కాదు అని వ్యాఖ్యానించారు. అటుపై మాట్లాడుతూ.. దురైమురుగన్ అని ఒకరున్నారు. కళాకారుడి కంట్లోనే వేలు పెట్టి ఆడించిన వ్యక్తి. ఇలాంటి ఓల్డ్ పొలిటీషియన్స్ ని హ్యాండిల్ చేస్తున్న సీఎం స్టాలిన్ కి హ్యాట్సాఫ్ అని రజినీకాంత్ అన్నారు. 

పళ్ళు పోయిన నటులు

దీంతో ఆగ్రహానికి గురైన దురైమురుగన్, పెద్ద నటులంతా వయసు మీరి, పళ్ళు పోయి, గడ్డాలు పెంచుకుని చావబోయే స్థితిలో కూడా నటిస్తూనే ఉన్నారు కాబట్టి యువకులకు అవకాశాలు రావడం లేదని తిప్పికొట్టారు. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


వాగ్యుద్ధం తీవ్రం

ఎప్పుడూ తన మనసులో అనిపించింది జోక్‌గా చెప్పే రకమే రజనీకాంత్. అలాగే ఇది కూడా అన్నారేమో. దీన్ని దురైమురుగన్ రుచి చూడలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దురైమురుగన్- రజనీ మధ్య జరిగిన ఈ వాగ్యుద్ధం తీవ్రతరం అయ్యింది. సోషల్ మీడియాలో దురైమురుగన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

దురైమురుగన్ నా స్నేహితుడు

ఈ నేపథ్యంలో దురైమురుగన్ వ్యాఖ్యలపై నటుడు రజనీ స్పందిస్తూ, ఆయన ఏం అన్నా నాకు బాధ లేదు' 'దురైమురుగన్ నాకు చాలా కాలం స్నేహితుడు, ఆయనంటే నాకు చాలా ఇష్టం, మా స్నేహం ఎప్పటికీ కొనసాగుతుంది' అని బదులిచ్చారు. 

Latest Videos

click me!