Rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్ లో 170కి పైగా చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ సీన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఇతర నటీనటుల్ని పట్టించుకోవడం అంతగా జరగదు. రజని పెర్ఫామెన్స్, స్టైల్ ఫ్యాన్స్ ని కట్టిపడేసే విధంగా ఉంటాయి. రజనీకాంత్ సినిమాల్లో చాలా మంది విలన్లుగా నటించారు.
తనతో నటించిన విలన్స్ గురించి ఒక సందర్భంలో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ని దశాబ్దాలుగా నటితున్నాను. చాలా మంది గొప్ప నటులు నా చిత్రాల్లో విలన్ గా నటించారు. కానీ నాకు ఛాలెంజ్ గా నిపించిన విలన్ ఒక్కరే. ఆయన భాషా చిత్రంలో నటించిన రఘువరన్ అని రజనీకాంత్ తెలిపారు.
ఇక మహిళా నటీమణుల్లో అయితే రమ్యకృష్ణ అని రజనీకాంత్ తెలిపారు. రమ్యకృష్ణ నరసింహ చిత్రంలో విలన్ గా నటించింది. రజనీకి పోటీగా క్రేజీ పెర్ఫామెన్స్ ఇచ్చింది రమ్యకృష్ణ. ఇక భాషా చిత్రంలో రఘువరన్ మార్క్ ఆంటోనిగా అదరగొట్టారు. సౌత్ లో చాలామంది విలన్లుగా నటించి గుర్తింపు పొందారు. కానీ రఘువరన్ స్టైల్ వేరు.
విలన్ అంటే భయంకరంగా కనిపించాలి.. గట్టిగా అరుస్తూ డైలాగులు చెప్పాలి అనే ట్రెండ్ కి ఫుల్ స్టాప్ తిట్టింది ఆయనే. రఘువరన్ చూడడానికి చాలా స్టైల్ గా ఉంటారు. బిగ్గరగా అరుస్తూ డైలాగులు చెప్పడం ఆయన శైలి కాదు. పొడి పొడి మాటలతో పేస్ ఎక్స్ప్రెషన్ తో అదరగొట్టడం ఆయన స్టైల్.
Raghuvaran
ఒకే ఒక్కడు చిత్రంలో విలన్ పాత్రకి ఆయన పర్ఫెక్ట్ ఛాయిస్. ఇంటర్వ్యూ సన్నివేశంలో రఘువరన్ నిజంగానే అర్జున్ కి చెమటలు పట్టించారట. ఇక తెలుగులో నాగార్జునతో శివ, మాస్ చిత్రాల్లో నటించారు. చిరంజీవి తో పసివాడి ప్రాణం లాంటి హిట్ మూవీలో నటించారు. ఎలాంటి స్టార్ హీరోతో నటించినా రఘువరన్ వాళ్ళకి పోటీగా నటించేవారు అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. ఆయన డైలాగ్ డెలివరీ శైలి అద్భుతంగ వర్కౌట్ అయింది.