ప్రస్తుతం ఈసినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో రజనీకాంత్, రానా దగ్గుబాటి , రితికా సింగ్ తదితరులు పాల్గొంటున్నారు. అయితే రజనీకాంత్ ఒ గొప్ప కార్యాన్ని తలపెట్టనున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడానికి కుదరలేదు కాబట్టి ప్రజలకోసం ఏదైనా చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నారట. అందుకోసం.. పేలకు అవసరమైన విద్య వైద్యం మీద దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన 12 ఏకరాల్లో భారీ హాస్పిటల్ ను నిర్మించబోతున్నట్టు సమాచారం.