కృష్ణంరాజు ముందే హీరోయిన్ తో ప్రభాస్ ఘాటు రొమాన్స్..?

First Published | Mar 2, 2024, 10:40 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు షాక్ ఇచ్చాడు సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు. పెదనాన్న ముందే హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ లు చేయాల్సి వచ్చిందట ప్రభాస్ కు.. మరి ఆ సిచ్యూవేషన్ ను స్టార్ హీరో ఎలా హ్యాండిల్ చేశాడోతెలుసా..? 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా మారాడు ప్రభాస్. కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నాడు. హైటు...పెర్సనాలిటీ.. యాక్టింగ్, డాన్స్ ఇలా అన్నింటిలో తన మార్క్ చూపిస్తూ..  పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. 

ఇడియాలోనే కాకుండా  విదేశాల్లో కూడా ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. రజినీకాంత్ తరువాత జపాన్ లాంటి దేశాల్లో ప్రభాస్ కి నిరాజనాలు పడుతుంటారు జనాలు. అంతలా ఎదిగాడు ప్రభాస్. బాహుబలి తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తున్న ఈ హీరో.. రీసెంట్ గా సలార్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. 
 


ఇక ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాల్లో వర్షం మూవీ ఒకటి. ఈసినిమాతో స్టార్ హీరోగా అవతారం ఎత్తాడు ప్రభాస్. ఈసినిమాలో త్రిష జంటగా నటించగా.. ఇద్దరి కాంబో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈసినిమాలో త్రిషతో ప్రభాస్ రొమాన్స్ ఓ రేంజ్ లో హైలెట్ అయ్యింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ప్రభాస్ చాలా సిగ్గరి. మోహమాటం కూడా ఎక్కువ. 
 

ఇక ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటే.. ప్రభాస్ కాస్త ఇబ్బందిపడుతాడట. ఇక తన ఫ్యామిలీ కాని.. ముఖ్యంగా పెదనాన్న కృష్ణరాజు కాని ఉంటే.. యాక్టింగ్ చేయడానికే ఇబ్బందిపడుతుంటాడట ప్రభాస్.. అటువంటిది పెదనాన్న ముందు రొమాంటిక్ సీన్ అంటే ఇక ప్రభాస్ కు పెద్ద టాస్క్.. ఈ పరిస్థితి వర్షం సినిమా టైమ్ లో ఎదురయ్యిందట. అప్పుడు ప్రభాస్ ఏం చేశాడంటే..? 

Image: UV Krishnam RajuInstagram

కెరియర్ బిగినింగ్ లో  కృష్ణంరాజు సినిమా సెట్ లో ఉంటే ఆయన వెళ్లిపోయే దాకా వెయిట్ చేసి అప్పుడు తను షూటింగ్ చేసేవాడట. అందుకే ప్రభాస్ సినిమా షూటింగ్ లకి ఎప్పుడు కృష్ణంరాజు వచ్చేవాడు కాదట. దాంతో ప్రభాస్ నార్మల్ గా యాక్టింగ్ చేసేవాడట. అయితే ఒక రోజు వర్షం సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఎమ్మెస్ రాజు కృష్ణంరాజును షూటింగ్ స్పాట్ కి రమ్మన్నాడట…

ఆ విషయం ప్రభాస్ కి తెలియదు. ఇక అప్పటికే త్రిషకి ప్రభాస్ కి మధ్య ఒక రొమాంటిక్ సీన్ ను దర్శకుడు షూట్ చేస్తున్నాడట. ఆ సీన్ అయిపోయాక పక్కకొచ్చి చూస్తే కృష్ణంరాజు ప్రభాస్ ను చూస్తూ సెట్ లో కుర్చున్నాడట. ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిన ప్రభాస్ పెదనాన్న ముందు రొమాంటిక్ సీన్ చేసినందుకు చాలా సిగ్గుపడ్డట..

కానీ కృష్ణంరాజు మాత్రం ప్రభాస్ భుజం మీద చెయ్యి వేసి యాక్టర్స్ అన్న తర్వాత ఇవన్నీ కామన్.. నటుడిగా అన్నీ చేయాలి అంటూ..  సినిమాకి సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నాడట… ఇక  ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వీళ్లిద్దరూ కలిసి బిల్లా, రెబల్, రాధే శ్యామ్ సినిమాల్లో కలిసి నటించారు.

Latest Videos

click me!