ప్రముఖ నటుడు కృష్ణ కుమారుడు, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈరోజు చాలా ప్రత్యేకం. ఆగస్టు 9న ఆయన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. ఈఏడాది 47వ ఏట మహేశ్ బాబు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సినీ తారల నుంచి, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అదేవిధంగా మహేశ్ చిన్నప్పటి కొన్ని అరుదైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.