మహేష్ బాబు అయితే సినిమాలు.. లేకుంటే ఫారెన్ టూర్లు.. ఈరెండు తప్పించి ఆయనకు పెద్దగా బయట తిరిగే అలవాటు లేదు. పార్టీలు, ఫంక్షన్స్ కు అసలే రారు. ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. తాజాగా ఆయన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్ లో ఉన్నారు. యూరప్ వెళ్ళిన మహేష్.. అక్కడ అందమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ తాలూకు ఫొటోలను సూపర్ స్టార్ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన అభిమానులతో పంచుకుంటున్నారు.