బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా ఈ షో రన్ అవుతుంది. మొదట 15 కంటెస్టెంట్లతో షో స్టార్ట్ కాగా, మధ్యలో దివ్య ఎంట్రీ ఇచ్చింది. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చారు. ఎలిమినేట్ అయిన భరణి మళ్లీ హౌజ్‌లోకి వచ్చాడు. ఈ మొత్తం కంటెస్టెంట్లలో ఏడుగురు కామనర్స్ ఎంట్రీ ఇవ్వగా, ప్రస్తుతం దివ్య, డీమాన్ పవన్, కళ్యాణ్ మాత్రమే హౌజ్‌లో ఉన్నారు. అయితే సెలబ్రిటీలకు మించి ఓటింగ్లో కళ్యాణ్ దూసుకుపోతుండటం విశేషం. ఈ సారి ఆయన విన్నర్ అయినా ఆశ్చర్యం లేదని, అదే జరిగితే కామనర్ చరిత్ర సృష్టించబోతున్నాడని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు హౌజ్ నుంచి శ్రీనివాస సాయి, దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీజ, హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియా, శ్రష్టి వర్మ, ఆయేషా జీనత్, రాము రాథోడ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.