#Guntur Kaaram Review : గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ... ఘాటు తలకెక్కిందంటున్న నెటిజన్లు..

First Published | Jan 12, 2024, 3:59 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఘాటు మసాలా లాంటి సినిమా  గుంటూరు కారం. ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు(జనవరి 12) రిలీజ్ కాబోతోంది. ముందుగా గుంటూరు కారం మూవీ ప్రీమియర్స్ సందడి చేయగా.. ఆసినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే...? 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. శ్రీలీల హీరోయిన్ గా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. ఈసినిమా.. ఎన్నో అడ్డంకులు దాటుకుని.. రిలీజ్ కు రెడీ అయ్యింది. సంక్రాంతి కానుకగా ఆఈరోజు అనగా జనవరి 12న ప్రపంచ  వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది మూవీ. ఈసినిమాపై పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇంతకీ నెటిజన్లు ఏమంటున్నారంటే..? 

ఫస్ట్ హాఫ్ మూవీ అయిపోగానే ట్విట్టర్ లో రెచ్చిపోయి పోస్ట్ లు పెట్టేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ.. సూపర్ డూపర్ హిట్ అంటూ.. పోస్ట్ లు...  కామెంట్లు పెడుతున్నారు.  ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కట్టిపేడేసింది.. ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియనంతగా మెస్మరైజ్ చేసింది అంటున్నారు ట్విట్టర్ జనాలు. 


ఇక ఈమూవీలో మహేష్ పెర్మామెన్స్ స్టన్నింగ్ అంటున్నారు. అంతే కాదు మహేష్ లుక్స్ కు ఫిదా అవ్వని వారుండరు.. మరో విషయం ఏంటంటే.. ఈసినిమాలో న్యూ ఏజ్ మహేష్ బాబు ను మరోసారి చూపించారు.. అది కూడా అద్భుతమైన లుక్స్ తో .. హ్యాండ్సమ్ అండ్ మాస్ హీరోగా మహేష్ కనిపించాడు అంటున్నారు. 

ఇక ప్యాన్స్ పండగ చేసుకుంటూ..సందడి చేస్తుంటే.. ఈ సినిమాపై నెగెటీవ్ పోస్ట్ లు కూడా కనిపిస్తున్నాయి. గుంటూరు కారం సినిమాను బాయ్ కాట్ చేయాలని.. ఈసినిమా వల్ల సైంధవ్, హనుమాన్ లాంటి మంచి సినిమాలు వెనకబడ్డాయంటూ..కొన్ని పోస్ట్ లు కనిపించాయి. గుంటూరు కారం నాన్ సెస్స్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

అయితే ఈసినిమా పెద్దగా ఏం లేదు అంటూ కూడా పోస్ట్ లు కనిపిస్తున్నాయి. గురుజీ ఈసారి కూడా అస్సాం చేశారు అంటూ..సెటైర్లు వెస్తున్నారు కొం తమంది నెటిజన్లు. అటు తమన్.. ఇటు త్రివిక్రమ్ పేర్లతో నెగెటీవ్ పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. మరికొందరు మాత్రం గురూజీ హాట్స్ హాఫ్.. అద్భుతంగా సినిమా తీశారంటున్నారు

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై ఎక్కువగా నెగెటీవ్ కనిపించలేదు.. చాలా వరకూ పాజిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  యావరేజ్ అని కూడా ఎవరూ పెట్టడం లేదు. ఈ సినిమాలో మహేష్ బాబు వన్ మాన్ షో.. ఇట్టాంటి లవ్ స్టోరీ ఎప్పుడూ వచ్చి ఉండదు.. ఇక ముందు కూడా రాదు ..  సూపర్ హిట్..బ్లాక్ బస్టర్ అన్న సంగతి ఫస్ట్ హాఫ్ లోనే తెలిసిపోయింది అంటున్నారు. 
 

అంతే కాదు ఇంట్రెవెల్  బ్యాంగ్ చింపేశారంటూ కామెంట్లుపెడుతున్నారు. మహేష్ కు పోటీగా శ్రీలీల కూడా పెర్ఫామెన్స్ ఇరగదీసింది. డాన్స్య అయితే మహేష్ అన్నట్టు తాట తీసి వదిలేసింది అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఈసారి మహేష్ బాబు కూడా డాన్స్లు అదరగొట్టాడు.. ఇంత వరకూ తన కెరీర్ లో ఏ సినిమాలో వేయలేనిస్టెప్పులు ఈసినిమాలో వేశాడు మహేష్.. ముఖ్యంగా మసాలా టైటిల్ సాంగ్ తో పాటు.. కుర్చీ మడతపెడితే సాంగ్ ఎంత పాపులర్అయ్యాయో తెలిసిందే. తెరపై కూడా ఈ పాటలు.. మహేష్.. శ్రీలీలస్టెప్పులకు ఈలలు, కేకలతో పాటు.. తెరపై గ్యాప్ లేకుండా పూల వర్షం కురిసింది. 

మొత్తానికి సూపర్ స్టార్ హిట్ కొట్టాడనే చెప్పాలి. గుంటూరు కారం ఘాటు గట్టిగానే కిక్కిస్తుంది ఫ్యాన్స్ కి. సరికొత్త మహేష్ బాబు సందడి చేస్తుండే సరికి ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈరోజు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిపోతుందన్ననమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మరి హిట్ ఒక్కటే అవుతుందా...? లేక కలెక్షన్ల పరంగా దూసుకుపోయి.. రికార్డ్ అవుతుందా అనేది చూడాలి. 
 

Latest Videos

click me!