Published : Jan 12, 2024, 03:50 AM ISTUpdated : Jan 12, 2024, 04:32 AM IST
దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం ప్రీమియర్స్ ముగిశాయి. టాక్ ఏంటో చూద్దాం...
మహేష్ బాబు ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఆయన వరుస హిట్స్ ఇస్తున్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ గత చిత్రం అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రం పై సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ట్రైలర్, సాంగ్స్ హైప్ పెంచేశాయి. సంక్రాంతికి గుంటూరు కారంతో గట్టిగా కొడుతున్నామని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేశారు.
27
Guntur Kaaram Review
గుంటూరు కారం మూవీలో మహేష్ మాస్ రోల్ చేశారు. ఆయనకు జంటగా శ్రీలీల నటించింది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్ కీలక రోల్స్ చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించగా, థమన్ సంగీతం అందించారు.
37
Guntur Kaaram Review
ఇక జనవరి 11 అర్ధరాత్రి నుండే యూఎస్ లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. దీంతో టాక్ బయటకు వచ్చింది. గుంటూరు కారం మూవీ మాస్ కమర్షియల్ అంశాలతో కూడిన మదర్ సెంటిమెంట్ మూవీ. తల్లి బహిష్కరణకు గురైన ఓ కొడుకు కథ. తల్లీ కొడుకులుగా రమ్యకృష్ణ, మహేష్ బాబు నటించారు.
47
Guntur Kaaram Review
మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో గుంటూరు కారం త్రివిక్రమ్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మహేష్ బాబు కామెడీ, డైలాగ్స్, మేనరిజమ్స్, డాన్సులు ఫ్యాన్స్ కి ఫీస్ట్. మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు.
57
కుర్చీ మడతపెట్టి సాంగ్, మిర్చి యాడ్ లో శ్రీలీల-మహేష్ డాన్స్ ఎపిసోడ్ హైలెట్ గా ఉంటాయి. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, క్యారెక్టరైజేషన్ మెప్పిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి.
67
Guntur Kaaram
అయితే సెకండ్ హాఫ్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హీరోయిన్ శ్రీలీల డాన్సుల పరంగా ఓకే, ఆమె నటన అసహజంగా ఉంటున్నారు. రెండో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. మదర్ సెంటిమెంట్ అంతగా వర్క్ అవుట్ కాలేదు. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్, డైలాగ్స్ మిస్ అయ్యాయనే వాదన వినిపిస్తోంది.
77
Guntur Kaaram
థమన్ సాంగ్స్ లో కుర్చీ మడతపెట్టి మాత్రమే అలరిస్తుంది. బీజీఎం పర్లేదు అంటున్నారు. మొత్తంగా గుంటూరు కారం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. మహేష్ ఫ్యాన్స్ కి ఫీస్ట్. మహేష్ తన భుజాలపై సినిమా నడిపించాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ మాత్రం నిరాశపరిచింది అంటున్నారు. ఫ్యాన్స్ కి, మాస్ చిత్రాలు ఇష్టపడే వారు ఎంజాయ్ చేసే చిత్రం.