Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా తక్కువ. హిట్లు లేకుండా ఏళ్ల తరబడి ఎదురు చూసిన సందర్భాలు లేవు. ఒక్కడు చిత్రం మహేష్ ని స్టార్ గా నిలబెడితే.. పోకిరి మూవీ టాలీవుడ్ గేమ్ ని మార్చేసింది. మహేష్ బాబు అగ్ర హీరోగా మారిపోయారు.
స్టార్ హీరోలు చాలా తక్కువ సందర్భాల్లో ప్రయోగాలు చేస్తుంటారు. వర్కౌట్ అయితే ఒకే కానీ ఫైల్ అయితే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు తన కెరీర్ లో తన ఇమేజ్ కి భిన్నంగా నిజం, నాని లాంటి చిత్రాల్లో నటించారు. ఏడేళ్ల పిల్లవాడు సైంటిస్ట్ ద్వారా 28 ఏళ్ళ కుర్రాడిగా మారిపోతాడు. ఈ చిత్రం పూర్తయ్యాక సూపర్ స్టార్ కృష్ణ ప్రివ్యూ చూశారట.
కృష్ణకి ఏమాత్రం నచ్చలేదు. ఈ మూవీ ఎలాగైనా ఫ్లాప్ కావాలని కోరుకున్నారట. అదేంటి కొడుకు నటించిన సినిమా హిట్ కావాలని కదా ఏ తండ్రి అయినా కోరుకుంటారు అనే సందేహం రావచ్చు. ఈ మూవీ హిట్ అయితే నువ్వు స్టార్ హీరో కాలేవు అని మహేష్ తో కృష్ణ అన్నారు. ఆయన ఎందుకు అలా అన్నారో మహేష్ కి తర్వాత అర్థం అయింది.
కృష్ణ కోరుకున్నట్లుగానే నాని చిత్రం డిజాస్టర్ అయింది. ఇలాంటి సినిమాలు స్టార్ ఇమేజ్ లేని నటులు చేస్తేనే వర్కౌట్ అవుతాయి. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు నటిస్తే వర్కౌట్ కావు. ఒకవేళ ఈ చిత్రం హిట్ అయితే మహేష్ కి స్టార్ ఇమేజ్ లేనట్లే అని కృష్ణ భావించారు. ఆయన మాటలలో ఆంతర్యం మహేష్ కి నెమ్మదిగా అర్థం అయింది. ఆ తర్వాత మహేష్ ప్రయోగాల జోలికి వెళ్ళలేదు.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ ప్రాజెక్టు గా ఈ చిత్రం రూపొందుతోంది. పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్.