మరోసారి రొమాన్స్ కు రెడీ అవుతున్న ఆషికీ 2 జంట, శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ మళ్లీ కలిసే ఛాన్సుందా?

ఆషికీ 2 మూవీతో  ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన జంట శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్. ఈ ఇద్దరు మళ్లీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.   మరి ఇందులో నిజం ఎంత..? ఏ సినిమాలు ఇద్దరు కనిపించబోతున్నారు? 

Shraddha Kapoor and aditya roy kapoor  Reunite New Romantic Drama in telugu jms
ఆషికీ 2 స్టార్స్

శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ 2013లో ఆషికీ 2 మూవీతో బాగా ఫేమస్ అయ్యారు. వీళ్లిద్దరూ మళ్లీ కలిసి ఓ రొమాంటిక్ డ్రామాలో నటిస్తారని తెలుస్తోంది. మోహిత్ సూరి డైరెక్షన్‌లో ఈ సినిమా రాబోతోందట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ జంట నటన, సినిమాలోని పాటలు ఆషికీ 2ను ఓ క్లాసిక్ మూవీగా నిలిపాయి. ఒకవేళ వీళ్లిద్దరూ కలిసి నటిస్తే మాత్రం అది సక్సెస్ ఫుల్ కాంబోఅవుతుంది. 

Also Read: సమంతకు గుడి కట్టిన వీరాభిమాని, స్టార్ హీరోయిన్ టెంపుల్ ఎక్కడుంది, ఎవరు కట్టారు?

Shraddha Kapoor and aditya roy kapoor  Reunite New Romantic Drama in telugu jms
మోహిత్ సూరి ఏం చెప్పాడంటే...

డైరెక్టర్ మోహిత్ సూరి ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్. ఈసారి కూడా కొత్త లవ్ స్టోరీతో వస్తున్నాడట. శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ కూడా కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని సమాచారం. 2026లో సినిమా స్టార్ట్ అవుతుందంటున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. 

Also Read:  వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?


ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఫ్యాన్స్

శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ మళ్లీ కలిసి నటిస్తారనే న్యూస్ వినగానే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీళ్ల గురించే చర్చ జరుగుతోంది. ఆషికీ 2లో వీళ్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మోహిత్ సూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

Also Read:  సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నిజం ఇదే?

Latest Videos

vuukle one pixel image
click me!