50 ఏళ్లు వచ్చినా ఏమాత్రం తగ్గని అందం, ఫిట్ నెస్ విషయంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే బ్యూటీ. కుర్రళ్ళ గుండెల్లో ఇప్పటిక గుబులు పుట్టిస్తోన్న హీరోయన్. ఒకప్పుడు స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. తనకంటే 10 ఏళ్లు చిన్న కుర్ర హీరోతో డేటింగ్ చేసిన బ్యూటీ.. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ తో కలిసి తిరుగుతుందని తెలుస్తోంది. మరి ఎవరా హీరోయిన్? ఏంటా కథ.
ఈ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు మలైకా అరోరా. పెళ్లి, విడాకులు.. ఆ తర్వాత తనకంటే చిన్నవాడితో లవ్, డేటింగ్ అంటూ ఎన్నోసార్లు ట్రోలింగ్ ఎదుర్కొంది మలైకా. అర్జున్ కపూర్ తో రీసెంట్ గా బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది. . ఇక ఇప్పుడు 51 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడిందట సీనియర్ బ్యూటీ. ఇప్పుడు ఆమె పేరు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగక్కర్ తో కలిసి తిరుగుతందని టాక్ వినిపిస్తుంది. ఇందుకు కారణం తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోస్.
ఇంతకీ అసలు కథ ఏంటంటే..? తాజాగా గువాహతిలో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి నటి, మోడల్ మలైకా అరోరా రావడం కొత్త రూమర్లకు తెరలేచింది. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగక్కరతో కలిసి ఆమె మ్యాచ్ చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను సంగక్కరతో కలిసి చూసిన మలైకా.. రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో కనిపించింది.
Malaika Arora
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ముఖ్య కోచ్‌గా ఉన్న కుమార్ సంగక్కర ఈ సీజన్‌లో టీమ్ క్రికెట్ డైరెక్టర్‌గా మారాడు. 2025 ఐపీఎల్‌కు ముందు రాహుల్ ద్రావిడ్ ముఖ్య కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఇది జరిగింది. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్లు వ్యాపిస్తున్నాయి. గతంలో ముంబై ఇండియన్స్ కోసం స్టేడియానికి వచ్చిన మలైకా.. రాజస్థాన్ టీమ్‌తో సంబంధం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ కొత్త జంటపై అందరి దృష్టి పడింది.
భర్త అర్బాజ్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత అర్జున్ కపూర్‌తో మలైకా ప్రేమలో ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, వీళ్లిద్దరూ గత సంవత్సరం నవంబర్‌లో విడిపోయారు. దీని గురించి ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. అర్జున్ కపూర్ కొత్త సినిమా 'మేరే హస్బెండ్ కి బీవీ' ప్రమోషన్‌లో తాను సింగిల్‌నని చెప్పాడు. 51 ఏళ్ల మలైకా, అర్బాజ్ ఖాన్ 1998 నుంచి 2017 వరకు కలిసి ఉన్నారు. వాళ్లకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు