కొత్తగా ప్రయత్నించిన చిరు, ఆ మూవీ కలెక్షన్స్ చూసి కృష్ణ ఏమన్నారో తెలుసా.. మెగాస్టార్ ఫుల్ హ్యాపీ

Published : Aug 10, 2025, 01:12 PM IST

చిరంజీవి తన కెరీర్ లో వైవిధ్యంగా ప్రయత్నించిన చిత్రాల్లో మాస్టర్ మూవీ ఒకటి. ఈ చిత్రం గురించి సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన మాటలకు చిరంజీవి ఆశ్చర్యపోయారు. 

PREV
15
చిరంజీవికి సెకండ్ టర్నింగ్ పాయింట్ 

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఖైదీ చిత్రం పెద్ద మలుపు. మెగాస్టార్ గా తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతున్న టైంలో చిరంజీవికి కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. ఆ టైంలో వచ్చిన హిట్లర్ చిత్రం మరో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ హిట్లర్ కి ముందు ఒకలా హిట్లర్ తర్వాత మరోలా సాగింది. హిట్లర్ మూవీ నుంచి చిరంజీవి ఎంచుకునే కథల్లో, తన బాడీ లాంగ్వేజ్ లో మార్పు కనిపించింది. హిట్లర్ తర్వాత చిరంజీవి కాస్త డిఫరెంట్ గా ట్రై చేసిన చిత్రం మాస్టర్. 

DID YOU KNOW ?
చిరంజీవి, కృష్ణ కలిసి నటించిన చిత్రాలు
సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి కలిసి అప్పట్లో తోడు దొంగలు, కొత్తపేట రౌడీ అనే చిత్రాల్లో నటించారు. 
25
లెక్చరర్ పాత్రలో చిరంజీవి

ఈ చిత్రం రిలీజ్ తర్వాత చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చిరంజీవి ఈ చిత్రంలో తెలుగు లెక్చరర్ గా నటించారు. భాషా చిత్ర దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అల్లు అరవింద్ నిర్మించారు. సురేష్ కృష్ణ, అల్లు అరవింద్ బలవంతం చేయడంతో ఈ చిత్రంలో చిరంజీవి ఓ పాట కూడా పాడారు. 'తమ్ముడు అరె తమ్ముడు' అంటూ సాగే ఆ పాట అప్పట్లో యువతని విపరీతంగా ఆకట్టుకుంది.

35
మాస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్

ఈ మూవీ రిలీజ్ అయి తొలి రెండు వారాలు కాస్త మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ చాలా ఏరియాల్లో రికార్డు ఓపెనింగ్స్ నమోదయ్యాయి. రెండు వారాల్లోనే 5 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. మూడవ వారం నుంచి మిక్స్డ్ టాక్ తొలగిపోయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

45
ఆ మూవీ ఈవెంట్ కి అతిథులుగా కృష్ణ, చిరు 

ఈ చిత్రం రిలీజ్ అయ్యాక చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరూ కమెడియన్ ఏవీఎస్ దర్శకత్వం వహించిన 'సూపర్ హీరోస్' అనే చిత్ర ఈవెంట్ కి అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్ లో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. సూపర్ స్టార్ కృష్ణకి అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ లో మంచి పరిచయాలు ఉండేవి. డిస్ట్రిబ్యూషన్ రంగంలో కృష్ణకి మంచి గ్రిప్ ఉండేది. ఏ సినిమా రిలీజ్ అయినా ఆ చిత్ర కలెక్షన్స్ కృష్ణకి ముందుగా తెలిసేవి. తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా కలెక్షన్స్ పక్కాగా తెలియడంతో సినిమా హిట్టా ఫ్లాపా అనే తేల్చేసేవారట. 

55
కృష్ణ మాటలకు ఆశ్చర్యపోయిన చిరంజీవి 

మాస్టర్ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ రావడంతో ప్రతి ఏరియా వసూళ్ళని కృష్ణ సూపర్ హీరోస్ మూవీ ఈవెంట్ లో చిరంజీవితో పంచుకున్నారు. మురళి మోహన్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావన వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ తన సినిమా కలెక్షన్స్ రికార్డ్స్ చెబుతుంటే చిరంజీవి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాదు ఆశ్చర్యపోయారట. 

Read more Photos on
click me!

Recommended Stories