
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రియాలిటీ షో ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ షో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లని ఫైనల్ చేసే పనిలో టీమ్ ఉంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో ఈ సారి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. వినిపిస్తోన్న సమాచారం మేరకు పలువురు క్రేజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. వివాదాస్పద కంటెస్టెంట్లకి పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఓ క్రేజీ సింగర్ పేరు తెరపైకి వచ్చింది. స్టార్ సింగర్‌ని దించుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సింగర్ సాకేత్ కోమండూరి బిగ్ బాస్ హౌజ్‌లోకి వస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు ఆయన్ని సంప్రదించారని, గాయకుడు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పట్టుబట్టి సాకేత్‌ని బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఆయన వస్తే అటు ఎంటర్‌టైన్‌మెంట్, ఇటు పాటలతో అలరించడంతోపాటు గేమ్స్ ఆడటంలోనూ ముందుంటారు. చాలా యాక్టీవ్‌గా ఉంటారు. దీంతో షోలో రచ్చ వేరే లెవల్‌లో ఉంటుందని బిగ్ బాస్ టీమ్ భావిస్తుందట. అయితే దీనికి సాకేత్ పారితోషికం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.
వీరితోపాటు పలువురు క్రేజీ సెలబ్రిటీలు హౌజ్‌లోకి కంటెస్టెంట్లుగా రాబోతున్నారట. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్ అయిన అమ్మాయి రమ్య కూడా హౌజ్‌లోకి రాబోతుంది. ఆమె ఇప్పటికే కన్ఫమ్ అయ్యింది. పికిల్స్ రేట్ అడిగినందుకు బూతులతో సమాధానం చెప్పి ఈ పికిల్ గర్ల్స్ పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అదే రచ్చ బిగ్ బాస్ హౌజ్‌లోనూ జరుగుతుందని టీమ్ భావిస్తుంది. ఆమెకి సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ ఈ షోకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. అయితే రమ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. జిమ్ లుక్‌లో, చీరలో ఫోటోలు పెట్టి నెటిజన్లకి మతిపోగొడుతుంది. ఇదంతా బిగ్ బాస్ రేటింగ్ పెంచడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
వీరితోపాటు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో కంటెస్టెంట్‌గా కన్ఫమ్ అయిన వారిలో ఇటీవల వివాదాస్పద నటి కల్పిక గణేష్, బుల్లితెర స్టార్స్ దీపికా, తేజస్విని, శివకుమార్, దేబ్జానీ, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, సాయికిరణ్, సుమంత్ అశ్విన్ వంటి వారు కంటెస్టెంట్లుగా ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యారు. వీరితోపాటు టీవీ నటి కావ్య శ్రీ పేరు వినిపిస్తుంది. అలాగే వర్మ సినిమాలోని ఓ బోల్డ్ నటి రాబోతుందట. ఈ వివరాలు తెలియాల్సి ఉంది. వీరితోపాటు కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఈ సారి దాదాపు ఐదుగురుని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి కామన్ మ్యాన్ లను పెంచుతున్నట్టు సమాచారం.
నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ 9వ సీజన్ బిగ్ బాస్ తెలుగు సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతుంది. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో దీని కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇప్పుడు ఆ సెట్‌ని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సారి హౌజ్‌లో సరికొత్త ట్విస్ట్ లు ఉండబోతున్నాయట. పలు క్రేజీ గేమ్స్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే 18 మంది కంటెస్టెంట్లని తొమ్మిది జంటలుగా చేసి హౌజ్‌లోకి పంపిస్తారని, జాతిరత్నాలు మాదిరిగా నవరత్నాలుగా వారిని పిలవబోతున్నారని సమాచారం. వైల్డ్ కార్డ్ ద్వారా మరో నలుగురు కంటెస్టెంట్లు వచ్చే అవకాశం ఉందని, ఈ సారి మొత్తంగా 22 మంది కంటెస్టెంట్లకి స్కోప్ ఉందని సమాచారం.