క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి 14 సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి స్టార్ హీరోని చేసేసిన కృష్ణ.. శ్రీదేవి వల్లే ఇదంతా

Published : Jan 10, 2026, 01:47 PM IST

సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేసేవారు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టార్ హీరోని చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకి దక్కుతుంది. ఆ వివరాలు ఈ కథనంలో చూడండి. 

PREV
15
సూపర్ స్టార్ కృష్ణ 

సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాలతో అప్పట్లో కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేసేవారు. కొత్త దర్శకులకు, నటీనటులకు అవకాశాలు ఇచ్చేవారు. అలా విధంగా సూపర్ స్టార్ కృష్ణ కంటపడ్డ ఒక నటుడు స్టార్ హీరోగా ఎదిగారు. ఆ నటుడికి సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా 14 సినిమాల్లో అవకాశం కల్పించారు. 

25
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాజేంద్ర ప్రసాద్ 

ఆ నటుడు ఎవరో కాలేదు కామెడీ కింగ్, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ కెరీర్ బిగినింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన రామ రాజ్యంలో భీమ రాజు అనే మూవీలో రాజేంద్ర ప్రసాద్ విలన్ కొడుకు పాత్రలో మెరిసారు. ఆ చిత్రంలో ఒక సీన్ లో జరిగిన సంఘటన గురించి రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

35
దిగ్గజ నటులతో నటించాను 

ఆ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, శ్రీదేవి లాంటి లెజెండ్స్ తో కలిసి నటించాను. శ్రీదేవిని నేను పెళ్లి చేసుకునే సీన్ అది. పెళ్లి పీటలపై కూర్చుని ఉంటే హీరో కృష్ణ గారు తమాషాగా నన్ను భయపెట్టి పెళ్లి చెడగొడతారు. ఆయన భయపెట్టే సీన్ లో నేను ఇచ్చిన హావ భావాలు చాలా బాగా నచ్చాయి అట. షాట్ అయిపోయాక ఎవరయ్యా ఈ కుర్రాడు భలే గమ్మత్తుగా నటిస్తున్నాడు అని అన్నారు. 

45
స్పాట్ లో 14 సినిమాలు ఇచ్చారు 

లొకేషన్ లో రాఘవేంద్రరావు తో పాటు చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కృష్ణ గారు వాళ్ళతో చెప్పి తన తదుపరి చిత్రాలలో నన్ను బుక్ చేసుకున్నారు. ఆల్రెడీ ఆ పాత్రకి వేరే వాళ్ళు ఎంపికైనా సరే వాళ్ళని పక్కన పెట్టి నన్ను తీసుకున్నారు. అలా అక్కడికక్కడే స్పాట్ లో 14 సినిమాల్లో కృష్ణ గారు ఛాన్స్ ఇచ్చారు. దీనితో నా దశ తిరిగిపోయింది. నా ట్యాలెంట్ చూపించే అవకాశం వచ్చింది అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 

55
స్టార్ గా ఎదిగిన రాజేంద్ర ప్రసాద్ 

ఆ తర్వాతి కాలంలో రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య మాస్ సినిమాలు చేస్తుంటే.. రాజేంద్ర ప్రసాద్ మాత్రం కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories