సన్నీ లియోన్ పేరుతో ప్రభుత్వ పథకం మోసం!

First Published | Dec 24, 2024, 7:55 AM IST

ఛత్తీస్‌గఢ్‌లో మహతారీ వందన్ యోజన పథకంలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి ప్రతినెలా రూ.1,000 మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

sunny leone

పేద ప్రజల కోసం ప్రభుత్వం పెట్టే పథకాల్లో చాలా సార్లు మోసాలు చేసుకుంటూంటాయి. అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే అవి తప్పవు. తాజాగా  ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం వివాహిత మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకంలో బాలీవుడ్‌ నటి సన్నీలియోని (Sunny Leone) పేరు ఉండడంతో అధికారులు షాక్‌ అయ్యారు. అంతేకాకుండా ఆమె పేరు మీద ఉన్న ఖాతాలోకి ప్రతినెలా ప్రభుత్వం నుంచి రూ.1,000 జమవుతున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. 


అసలు ఏమి జరింగింది అంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని భాజపా ప్రభుత్వం మహతారీ వందన్ యోజన (Mahtari Vandan Yojana) పథకం కింద రాష్ట్రంలోని వివాహిత మహిళలకు ప్రతి నెలా వారి ఖాతాల్లో రూ.1,000 జమ చేస్తుంటుంది. ఇటీవల అధికారులు మహిళల ఖాతాలను పరిశీలిస్తుండగా బాలీవుడ్‌ నటి సన్నీలియోని పేరుతో ఓ ఖాతా ఉండడాన్ని గుర్తించారు.

దీనిపై విచారణ జరపగా బస్తర్‌ ప్రాంతంలోని తాలూర్‌ గ్రామానికి చెంందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి నటి పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాను తెరిచి.. మహిళలందరికీ వర్తించే మహతారీ వందన్‌ యోజన పథకానికి నమోదు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. 



ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.వెయ్యి పొందుతున్నాడని పేర్కొన్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశామన్నారు. పథకంలో అర్హులైన లబ్ధిదారుల వెరిఫికేషన్‌కు బాధ్యులైన అధికారులను కూడా విచారిస్తున్నామని వెల్లడించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్‌.హరీశ్‌  కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని సదరు బ్యాంక్‌ అకౌంట్‌ను సీజ్‌ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు. 
 

సన్నిలియోన్ అంటే మేల్ ఆడియెన్స్‌కి ఎంత క్రేజో.. సినీవర్గాలకి ఆమెపై అంత నమ్మకం కూడా.  ఇప్పటికే సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా అన్ని జానర్లతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు.

మరోసారి సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ‘మందిర’ అంటూ వచ్చింది. అయితే ఈ సినిమా వర్కవుట్ కాలేదు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ‘మందిర’ చిత్రాన్ని కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మించారు.  


మరో ప్రక్క సన్నిలియోన్ తో ఓ ఐటంసాంగ్ చేయిస్తే, సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ ఫ్రీగా వచ్చిపడిద్ది అనేది చాలామంది దర్శకులు, నిర్మాతలకి వున్న నమ్మకం. రీసెంట్ గా రాయిస్ సినిమాలో సన్నిలియోన్ చేసిన లైలా మే లైలా ఐటంసాంగ్ సాంగ్‌కి వచ్చిన క్రేజే అందుకు ఓ ఉదాహరణ.

యూత్‌ని హుషారెత్తించిన ఈ పాట రాయిస్ సినిమాకి మరో హైలైట్‌గా నిలిచింది. షారుఖ్‌కి సమానమైన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ పాటలో స్టెప్పేసిన సన్నిలియోన్‌కి కనిపించింది. ఇంతకుముందెప్పుడూ ఏ ఐటంసాంగ్‌కి లేని రీతిలో ఈ సాంగ్‌ని 20  కోట్ల మంది వీక్షించారు. అది కూడా కేవలం అఫీషియల్ హ్యాండిల్‌పై మాత్రమే. 
 

Latest Videos

click me!