ఇక ఇది ఇలా ఉంటే సునిల్ పొలిటికల్ అవతారం ఎత్తబోతున్నట్టు తెలుస్తోంది. సునీల్ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు సినిమాలోనే. ఇప్పటి వరకూ సునిల్ పొలిటికల్ లీడర్ పాత్ర చేయలేదు. ఫస్ట్ టైమ్ తమిళంలో స్టార్ హీరో విజయ్ సినిమాలో ఈ పాత్ర చేయబోతున్నాడట.
విజయ్ దళపతి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమాలు కూడా మానేయబోతున్నారు. ఆయన చివరి చిత్రంగా జన నాయగన్ మూవీలో నటిస్తున్నారు. తన పొలిటికల్ కెరీర్ కి ప్లస్ అయ్యేలా ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామాగా రూపొందిస్తున్నారు.