12 గంటల్లో 21 పాటలు, 60 ఏళ్ల కెరీర్ లో 40000 కు పైగా సాంగ్స్ పాడిన స్టార్ సింగర్ ?

Published : Apr 27, 2025, 07:50 AM ISTUpdated : Apr 27, 2025, 08:03 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద  స్టార్ అయినా ఏదో ఒక సందర్భంలో విమర్శలు ఫేస్ చేయక తప్పదు. అటువంటి సందర్భం తనకు చాలాసార్లు వచ్చిందంటూ  గత ఇంటర్వ్యూలలో వెల్లడించారు దివంగత గాయకుడు. ఇండస్ట్రీలో  పాటల కింగ్ అనిపించుకున్న  ఆ గాయకుడు.. కొన్ని అపవాదులు కూడా మోశారు. 

PREV
15
12 గంటల్లో 21 పాటలు, 60 ఏళ్ల కెరీర్ లో 40000 కు పైగా సాంగ్స్  పాడిన  స్టార్ సింగర్ ?

ఇంతకీ ఆసింగర్ ఎవరో కాదు ఎస్ పీ బాలు.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గాయకులు ఉన్నప్పటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఆయన గొంతు ఎంతో మధురంగా ఉండేది.

25
ఎస్పీబీ పాటలతోనే బ్రతికే ఉన్నారు

 ఆయన పాటలు వినడానికి ఎంతో మధురంగా ఉంటాయి. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పాటల ద్వారా అభిమానుల హృదయాల్లో బ్రతికే ఉన్నారు. ప్రతీ చోట పాట రూపంలో మారు మోగుతూనే ఉన్నారు. 

35
40,000 పాటలు పాడిన గాయకుడు

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీతో సహా 14 భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడారు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. అరవై ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో రాణించారు.కెరీర్ బిగినింగ్ లో చాలా విమర్శలు ఫేస్ చేశారు బాలు. మహదేవన్ లాంటి స్టార్స్ తో కలిసి డ్రింక్ తాగేవారట. దాంతో లిక్కర్ సప్లై చేసి అవకాశాలు పొందుతున్నాడు బాలు అని విమర్శలు కూడా వచ్చాయట. వాటిని తిప్పి కోడుతూ.. తన టాలెంట్ తో ఎదుగుతూ వచ్చారు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.

45
ఎస్పీబీ రికార్డ్ సృష్టించారు

చాలా మంది ఫోన్లలో ఇప్పటికీ ఎస్పీబీ పాటలే రింగ్‌టోన్స్ గా వినిపిస్తుంటాయి. అంతే కాదు  12 గంటల్లో 21 పాటలు పాడిన  రికార్డ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు మాత్రమే సొంతం. 

55
ఎస్పీబీ గొంతు విమర్శించబడింది

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి వారికి పాడటంలో ఇబ్బంది లేదు. కానీ, రాజ్ బాబు, అల్లు రామలింగయ్యలను అనుకరిస్తూ పాడటానికి ప్రయత్నించారు. మన్మథుడు సినిమాలో నాగార్జునలా పాడాల్సి వచ్చింది. అయితే ఈ పాట మాత్రం  బాగా పాడలేకపోయారు అన్న విమర్శను ఫేస్ చేశారట ఎస్పీబి. 

Read more Photos on
click me!

Recommended Stories