నార్త్ లో భారీ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా? అల్లు అర్జున్, ప్రభాస్ కాదు!

Published : Apr 07, 2024, 07:35 AM IST

నార్త్ ఇండియాలో పాన్ ఇండియా స్టార్స్ కి మించి ఓ హీరో క్రేజ్ అనుభవిస్తున్నాడు. ఆయన అల్లు అర్జున్, ప్రభాస్ కూడా కాదు. మరి ఆ  తెలుగు హీరో ఎవరో చూద్దాం...   

PREV
15
నార్త్ లో భారీ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా? అల్లు అర్జున్, ప్రభాస్ కాదు!


అల్లు అర్జున్, ప్రభాస్ పాన్ ఇండియా హీరోలు. ప్రభాస్ బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా హీరో అయ్యాడు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 
 

25

ఇక పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప హిందీ వర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. పుష్ప విడుదల తర్వాత అల్లు అర్జున్ కి నార్త్ లో ఫేమ్ వచ్చింది. పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 
 

35
NTR-Ram Charan


అల్లు అర్జున్, ప్రభాస్ ల తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు. వారిద్దరూ కలిసి నటించిన మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ భారీ విజయం సాధించింది. దాదాపు రూ. 1100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్ దేవర, గేమ్ ఛేంజర్ లపై అంచనాలు ఉన్నాయి. 

45


టాలీవుడ్ నుండి అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా ఉన్నారు. అయితే వీరందరినీ మించి ఒక హీరో నార్త్ లో ఫేమ్ అనుభవిస్తున్నాడు. 

 

55

ఆ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని. ఈ హీరో నటించిన చిత్రాలు హిందీలో డబ్ అయ్యాయి. అవి యూట్యూబ్ లో విడుదల చేశారు. ఆ చిత్రాలను హిందీ ఆడియన్స్ విపరీతంగా చూశారు . అంతే కాదు గూగుల్ లో నార్త్ ఆడియన్స్ రామ్ పోతినేని గురించి ఎక్కువగా సెర్చ్ చేశారట. అదన్నమాట సంగతి... 

Read more Photos on
click me!

Recommended Stories