హీరోయిన్ గా బిగ్ బాస్ అశ్వినిశ్రీ... టైటిల్ ఏమిటో తెలుసా? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Published : Apr 07, 2024, 08:31 AM IST

బిగ్ బాస్ ఫేమ్ అశ్వినిశ్రీ హీరోయిన్ గా ఆఫర్ పట్టేసింది. ఈ మేరకు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ డిటైల్స్ ఏమిటో చూద్దాం...   

PREV
16
హీరోయిన్ గా బిగ్ బాస్ అశ్వినిశ్రీ... టైటిల్ ఏమిటో తెలుసా? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!
Bigg Boss Ashwini Sree

అశ్వినిశ్రీ పరిచయం అక్కర్లేని పేరు. ఆమె పలు చిత్రాల్లో నటించింది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ రష్మిక మందాన అక్క పాత్ర చేసింది. అలాగే కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. 
 

26
Bigg Boss Ashwini Sree

బిగ్ బాస్ సీజన్ 7లో అశ్వినిశ్రీ  కంటెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. అంబటి అర్జున్, నయని పావని, పూజ, భోలే షావలి, అశ్వినిశ్రీలను మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి హౌస్లోకి పంపారు. 

 

36
Bigg Boss Ashwini Sree

అశ్వినిశ్రీ బాగానే రాణించింది. 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పాడు. అయినప్పటికీ అశ్వినిశ్రీ ఎవరినీ నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేట్ అయ్యింది. అది ఆమెకు మైనస్ అయ్యింది.రతిక రోజ్, అశ్వినిశ్రీ ఎలిమినేట్ అయ్యారు. 

46
Bigg Boss Ashwini Sree

బిగ్ బాస్ ఫినాలే రోజు అశ్వినిశ్రీ కారుపై దాడి జరిగింది. తన ఖరీదైన కారు అద్దాలను ఎవరో పగలగొట్టారు. దానితో ఆమె ఆవేదన చెందింది. ఇలా ఎవరైనా చేస్తారా అంటూ వాపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

56
Bigg Boss Ashwini Sree

ఇదిలా ఉండగా అశ్వినిశ్రీ బంపర్ ఆఫర్ పట్టేసింది. ఆమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అశ్వినిశ్రీ తాను చేస్తున్న కొత్త చిత్ర విశేషాలు పంచుకుంది. అశ్వినిశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. త్వరలో షూటింగ్ కి వెళ్లనుంది. 

 

66
Bigg Boss Ashwini Sree

ఇక ఈ చిత్రానికి మిస్ జానకి అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అశ్వినిశ్రీ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి హైట్, పర్సనాలిటీ కలిగిన అశ్వినిశ్రీ హీరోయిన్ గా సక్సెస్ అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు ఆదరణ తక్కువ. 

click me!

Recommended Stories