ఈ చిత్రంలో సందీప్ కిషన్ కి జోడిగా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడుతున్నాయి. వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంతవరకు వసూళ్లు రాబడుతుందో రానున్న రోజుల్లో చూడాలి.