Janaki kalaganaledu: కొడుకు బండిలోనే బాంబు పెట్టించిన సునంద.. ఎంతోమంది ప్రాణాలను కాపాడిన జానకి!

First Published Jan 27, 2022, 1:31 PM IST

Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

ఇక జానకి (Janaki), రామ చంద్ర ఇంటికి వెళ్లాలని బయలుదేరుతారు. కానీ పక్కన కన్నబాబు వచ్చి బైకు పోటీల గురించి ఓవర్ గా మాట్లాడటంతో రామచంద్ర (Ramachandra) ఎలాగైనా బైక్ పోటీలో గెలవాలని అనుకుంటాడు. దానికి జానకి కూడా సంతోషపడుతుంది.
 

మొత్తానికి పోటీలో రామచంద్ర (Ramachandra), కన్నబాబు, విష్ణు (Vishnu) పాల్గొంటారు. ఇక గోవిందరాజులు తన ఇద్దరి కొడుకులకు ధైర్యం ఇస్తాడు. ఇక జ్ఞానాంబ  బహుమతి గెలవక పోయినా సరే ఎటువంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా పోటీలో పాల్గొమని చెబుతుంది.
 

అందరూ రామచంద్ర పై ఆశలు పెంచుకుంటారు. ఇక తన భర్త గురించి ఎవరు పట్టించుకోవడం లేదని మల్లిక  (Mallika) బాధపడుతూ అందరిని అడుగుతుంది. దాంతో గోవిందరాజులు (Govinda Raju) నీ భర్త నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే గెలుపు పై ఆశలు వదులుకున్నాడమ్మ అని కామెడీ చేస్తాడు.
 

ఇక మొత్తానికి పోటీ ప్రారంభమవుతుంది. మరోవైపు సునంద (Sunanda) వేదికపై కూర్చొని తన కొడుకు కన్నబాబు గెలవాలని ఆతృత పడుతుంది. అంతలోనే తన మనిషి ఫోన్ చేసి రామచంద్ర (Ramachandra) బైక్ కు బాంబు పెట్టానని చెబుతాడు. ఇక సునంద అక్కడే తన కొడుకు కూడా ఉన్నాడు అని భయపడుతుంది.
 

ఇక పోటీలు జరుగుతూనే ఉండగా కన్నబాబు (Kanna Babu).. రామచంద్ర బండిని తన్నడంతో కింద పడిపోతాడు. ఇక అందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చి రామచంద్ర ని లేపుతారు. జ్ఞానాంబ ఇంటికి వెళ్దాం పదండి అని అనేసరికి రామచంద్ర (Ramachandra) ఏం కాదు అమ్మ అని అంటాడు.
 

జానకి (Janaki) కింద వైపు చూస్తూ బాంబు ని చూస్తుంది. ఇక్కడ బాంబు ఉందని చెప్పేసరికి అందరూ దూరంగా పరిగెడతారు. కానీ జానకి మాత్రం అక్కడున్న వారందరిని రక్షించడానికి బాంబు పేలకుండా ప్రయత్నం చేస్తుంది. కాని జ్ఞానాంబ (Jnanamba), రామచంద్ర తో పాటు అందరూ జానకిని వెనుకకి రమ్మంటారు.
 

ఏం కాదు అని ధైర్యం చేసి జానకి (Janaki) బాంబు పేలుడును ఆపుతుంది. దీంతో అందరూ ఒకేసారి ఊపిరి పీల్చుకుని జానకి మెచ్చుకుంటారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన జానకిని  పోలీసు అధికారులు కూడా మెచ్చుకుంటారు.

click me!